India VS China : భారత్ వర్సెస్ చైనా వయా శ్రీలంక ప్లాన్ సిద్ధమవుతోందా?.. డ్రాగన్ చర్యలకు చెక్ పెట్టేనా?..
India VS China : భారత్ వర్సెస్ చైనా వయా శ్రీలంక ప్లాన్ సిద్ధమవుతోందా? డ్రాగన్ చర్యలకు చెక్ పెట్టేందుకు మోదీ సర్కార్ వ్యూహమేంటి? ఈ కథనంలో తెలుసుకుందాం.
India VS China : భారత్ వర్సెస్ చైనా వయా శ్రీలంక ప్లాన్ సిద్ధమవుతోందా? డ్రాగన్ చర్యలకు చెక్ పెట్టేందుకు మోదీ సర్కార్ వ్యూహమేంటి? ఈ కథనంలో తెలుసుకుందాం. చైనా విషయంలో భారత్ ఎప్పుడూ దూకుడుగానే ఉంటోంది. తాజాగా చైనాను ఎదుర్కోవడానికి మరో మాస్టర్ ప్లాన్ వేసింది భారత్. అందుకు శ్రీలంకను ఓ ఆయుధంగా వాడుకోవడానికి ముందడుగు వేసింది మోదీ సర్కార్. శ్రీలంక నుంచి భారత్‌కు దూరం వందల కిలోమీటర్లే ఉంటుంది. అలాంటి దేశంలోని ఓడరేవులో పాగా వేసింది భారత్. ఒకప్పుడు చైనా ఏకంగా సబ్‌మెరైన్లను కూడా శ్రీలంకలో నిలిపిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే వాస్తవాధీన రేఖ వెంట పాకిస్థాన్‌లోని ఆక్రమిత కశ్మీర్, గ్వాదర్ పోర్టు శ్రీలంకలోని హంబన్‌టోటా పోర్టులో డ్రాగన్ దళాలు మోహరిస్తే, భారత్ అన్ని వైపుల నుంచి ముప్పును ఎదుర్కొంటుంది. అందుకే శ్రీలంకలో పరపతి పెంచుకోవడానికి చకచకా యత్నాలు చేస్తోంది భారత్.
తాజాగా చైనా బే కు అత్యంత సమీపంలోని ట్రింకోమలీ చమురు ట్యాంకుల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనుంది మోదీ ప్రభుత్వం. శ్రీలంకలోని ట్రింకోమలీ ప్రపంచంలోనే మూడో అత్యంత లోతైన, పెద్ద పోర్టు. ఇక్కడికి సమీపంలోని ‘చైనాబే’ అనే ప్రాంతంలో ఒక్కోదానికి దాదాపు 12వేల కిలో లీటర్ల సామర్థ్యం ఉన్న 99 చమురు ట్యాంకులు ఉన్నాయి. వీటిని రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నౌకల్లో చమురు నింపేందుకు నిర్మించారు బ్రిటిష్ పాలకులు. ఈ పోర్టు అత్యంత వ్యూహాత్మక ప్రదేశంలో ఉంది. ఈ పోర్టులోని చమురు ట్యాంకుల అభివృద్ధి ప్రాజెక్టులో భారత్‌కు వాటా దక్కినట్లు ప్రకటించారు శ్రీలంక ఇంధన శాఖ మంత్రి ఉదయ గమ్మన్‌పిల. ఈ పోర్టు చెన్నైకి అత్యంత సమీపంలో ఉంది. ఒకవేళ చైనా ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే, భారత్ దీన్ని ఉపయోగించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Also read:
RBI Recruitment 2022: ఆర్‌బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చంటే?
Realme GT 2 Pro: రియల్‌మీ తొలి ఫ్లాగ్‌షిప్ ఫోన్ విడుదలకు సిద్ధం.. ఫీచర్లివే!
Cyber Attack: రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. 40 పైసలకు 6 లక్షలు అంటూ భారీ ఝలక్..