బ్రేకింగ్..మా వాళ్ళు 30మంది మరణించారు.. చైనా
భారత-చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణలో తమ సైనికులు 30మంది మరణించారని చైనా మొదటిసారిగా అంగీకరించింది. ఇప్పటివరకు తమవైపు ఎంతమంది మరణించిందీ లేదా గాయపడిందీ నోరు సిప్పాని....
భారత-చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణలో తమ సైనికులు 30మంది మరణించారని చైనా మొదటిసారిగా అంగీకరించింది. ఇప్పటివరకు తమవైపు ఎంతమంది మరణించిందీ లేదా గాయపడిందీ నోరు విప్పని.. బీజింగ్.. తొలిసారిగా తమవాళ్లు ముప్పయ్ మంది మృతి చెందినట్టు ప్రకటించింది. అయితే భారత సైనికులు ఇరవై మంది మరణించినట్టు ఇండియన్ ఆర్మీ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే..
ఇలా ఉండగా.. బుధవారం భారత విదేశాంగ మంత్రి ఎస్,జైశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ తో ఫోన్ లో మాట్లాడుతూ.. బోర్డర్ సమస్యను ఉభయ దేశాలూ శాంతి యుతంగా పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు, భారత చైనా దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఈ విధమైన ఘర్షణలు అవరోధాలుగా మారుతాయన్నారు. ఓక దేశం గౌరవాన్ని మరొక దేశం గుర్తించాలని అన్నారు. కాగా- వాంగ్ ఈ మాత్రం ఈ సందర్భంగా తీవ్రంగా మాట్లాడుతూ.. బోర్డర్స్ ఉల్లంఘించిన వారిపట్ల కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పరోక్షంగా ఈ ఘర్షణకు భారత సైనికులే కారణమని ఆరోపించారు. అయితే ఘర్షణకిది సమయం కాదనన్న జయశంకర్ అభిప్రాయంతో ఆయన ఏకీభవించారు.
చైనా సైనికులు ముందుగానే ప్లాన్ చేసుకుని ‘చర్య’ కు దిగారని, ఘర్షణకు ఇదే కారణమని మొదట జైశంకర్ ఆరోపించారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ఈ విధమైన పరిణామాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతాయన్నారు. చైనా తన చర్యలను మదింపు చేసుకుని సరిదిద్దుకోవాలని సుతిమెత్తగా సూచిందారు.