మీరే చేశారు.. కాదు.. మీరే చేశారు.. భారత్-చైనా పరస్పర ఆరోపణలు
ఇండో-చైనా దేశాల దళాల మధ్య ఘర్షణ జరిగి రెండు వైపులా 'నష్టం' కలిగిన నేపథ్యంలో మీ సైనికులే బోర్డర్ దాటి వచ్చారని ఒకరంటే.. కాదు..కాదు మీరే నని పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. ఉద్రిక్తతల సడలింపునకుచర్చలకు..
ఇండో-చైనా దేశాల దళాల మధ్య ఘర్షణ జరిగి రెండు వైపులా ‘నష్టం’ కలిగిన నేపథ్యంలో మీ సైనికులే బోర్డర్ దాటి వచ్చారని ఒకరంటే.. కాదు..కాదు మీరే నని పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటున్నాయి. ఉద్రిక్తతల సడలింపునకుచర్చలకు తాము సిధ్ధమని ప్రకటించినప్పటికీ భారత ప్రధాని మోదీ కఠిన పదజాలంతో మాట్లాడుతున్నారని చైనా ఆరోపిస్తోంది. వివాదాస్పద సరిహద్దులో రెండు కిలోమీటర్ల పరిధిలో ఎవరూ గన్స్ తీసుకురాదన్న శాంతి ఒప్పందం గతంలోనే కుదిరింది. కానీ తాజాగా ఉభయ దేశాల సైనికుల మధ్య రాళ్లు, రాడ్లతో ఘర్షణ అజరిగింది. కాగా భారత సైనికులు తమవారిని ఎలా గాయాలకు గురి చేశారో చైనా అనుకూల మీడియా ఫోటోలను పోస్ట్ చేసింది. అమెరికా ప్రోద్బలం వల్లే ఇండియా ఇలాంటి చర్యలకు దిగుతోందని అక్కడి గ్లోబల్ టైమ్స్ పత్రిక ఆరోపించింది. కాగా చైనా దుశ్చర్యను ఖండిస్తూ భోపాల్ లో వందలాది మంది నిరసనకారులు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ పోస్టర్లను దగ్ధం చేశారు.