మహిళలకు శుభవార్త: చీర కొంటే..”కరోనా కిట్లు” ఫ్రీ..

కరోనా, లాక్‌డౌన్ కారణంగా వ్యాపార లావాదేవీలు భారీగా కుదేలయ్యాయి. అయితే, ఇప్పుడిప్పుడే లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తివేస్తూ..సడలింపులు ప్రకటించటంతో తిరిగి వ్యాపార, వాణిజ్య రంగాలు ఊపందుకుంటున్నాయి. వస్త్ర వ్యాపారులు తీసుకొచ్చిన కొత్త ఆఫర్ అందరినీ ఆకట్టుకుంటోంది. మహిళలు చీర కొంటె చీరతో పాటు

మహిళలకు శుభవార్త: చీర కొంటే..కరోనా కిట్లు ఫ్రీ..
Follow us
Jyothi Gadda

|

Updated on: Jun 18, 2020 | 4:17 PM

కరోనా, లాక్‌డౌన్ కారణంగా వ్యాపార లావాదేవీలు భారీగా కుదేలయ్యాయి. అయితే, ఇప్పుడిప్పుడే లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తివేస్తూ..సడలింపులు ప్రకటించటంతో తిరిగి వ్యాపార, వాణిజ్య రంగాలు ఊపందుకుంటున్నాయి. కరోనా మాస్క్‌లను కూడా వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అమ్మకాలు పెంచుకునేందుకు వాటితో పలు రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నారు. సూరత్‌లో వస్త్రవ్యాపారులు తీసుకొచ్చిన కొత్త ఆఫర్‌తో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు.

సూరత్‌ వస్త్ర వ్యాపారులు తీసుకొచ్చిన కొత్త ఆఫర్ అందరినీ ఆకట్టుకుంటోంది. మహిళలు చీర కొంటె చీరతో పాటు శానిటైజర్లు, హోమియోపతి మందు బిళ్లల డబ్బా, ఆయుర్వేదం పౌడర్, మాస్క్‌లు కూడా అందిస్తున్నారు. చీరతో పాటు ఈ బాక్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. కరోనా వైరస్ రాకుండా మహిళలు తమను తాము రక్షించుకునేందుకు ఈ ఆఫర్ ఉపయోగపడుతుందని వారు చెబుతున్నారు. “కరోనా కవచం” పేరుతో ఈ స్పెషల్ ఆఫర్లు ఇస్తున్నారు. రూ. 500 నుంచి రూ. 5000 వరకు ఖరీదు ఉండే చీరలకు ఇలా కరోనా కవచం బాక్సులు అందజేస్తున్నారు. చీరలకు “కరోనా కిట్లు ఫ్రీ” అంటూ సూరత్ వ్యాపారులు ఆఫర్లు ప్రకటించిన విషయం తెలిసిన వెంటనే యూపీ, రాజస్థాన్, బీహార్ నుంచి ఆర్డర్లు వస్తున్నాయని వస్త్ర వ్యాపారులు చెబుతున్నారు. చీరతో పాటు శానిటైజర్లు, హోమియోపతి మందు బిళ్లల డబ్బా, ఆయుర్వేదం పౌడర్, మాస్క్‌లు కూడా ఫ్రీగా వస్తుండడంతో మహిళలు కూడా వాటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు.