పానీపూరీ ప్రియుల‌కు చేదువార్త.‌..! అమ్మకాలపై నిషేధం

కరోనా మహమ్మారి తీవ్ర ప్రతాపం చూపెడుతోంది. కరోనా కట్టడికి సర్కార్ కఠిన చర్యలు అమలు చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో రోజురోజుకూ కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే...పానీపూరి వ్యాపారుల నిర్ల‌క్ష్యం వ‌ల్ల క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌రించే ప్ర‌మాదం ఉన్న కార‌ణంగా...

పానీపూరీ ప్రియుల‌కు చేదువార్త.‌..! అమ్మకాలపై నిషేధం
Jyothi Gadda

|

Jun 17, 2020 | 7:49 PM

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్ర ప్రతాపం చూపెడుతోంది. కరోనా కట్టడికి యూపీ సర్కార్ కఠిన చర్యలు అమలు చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో రోజురోజుకూ కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే కాన్పూర్ జిల్లా‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ‌కు అడ్డుక‌ట్ట వేయ‌డం కోసం అక్క‌డి జిల్లా యంత్రాంగం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పానీపూరి అమ్మకాల‌పై కాన్పూర్‌ జిల్లా అంత‌టా నిషేధం విధిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. కాన్పూర్ జిల్లాలో ల‌భించే తినుబండారాల్లో పానీపూరికి ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. అక్క‌డి ప్ర‌జ‌లు నిత్యం పానీపూరి రుచి చూస్తారు.

కాగా, పానీపూరీ వ్యాపారులు లాక్‌డౌన్‌ నిబంధనలను స‌రిగా పాటించడం లేదని అధికారులు గుర్తించారు. పానీపూరీ అమ్మకాలు జరిపే స‌మ‌యంలో చాలా మంది ముఖాల‌కు మాస్కులు, చేతుల‌కు గ్లౌజులు ధరించడం లేదని అధికారులు తెలిపారు. పానీపూరి వ్యాపారుల నిర్ల‌క్ష్యం వ‌ల్ల క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌రించే ప్ర‌మాదం ఉన్న కార‌ణంగానే తాము ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని చెప్పారు. కాగా, జిల్లా అధికారులు నిర్ణ‌యంవ‌ల్ల తాము ఉపాధి కోల్పోయామ‌ని పానీపూరి వ్యాపారులు చెబుతున్నారు. కాగా, జిల్లా అధికారులు తీసుకున్న నిర్ణ‌యం‌ పానీపూరీ ప్రియుల‌ను తీవ్ర నిరాశ‌కు గురిచేసింది.

ఇదిలా ఉంటే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం సాయంత్రం నాటికి అందిన సమాచారం మేరకు యూపీలో కొత్తగా 583 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య శాఖ అధికారులు తెలిపారు. కరోనా వల్ల 30 మంది చనిపోగా, రాష్ట్రంలో మొత్తం 465 మంది కోవిడ్ -19తో మృతి చెందారని వైద్య అధికారులు తెలిపారు. యూపీ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 15,181 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం తెలిపింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu