రాజస్థాన్‌లో కొత్తగా మరో 122 కరోనా పాజిటివ్ కేసులు

రాజస్థాన్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన కొద్ది రోజులుగా వందల్లో కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేసులు సంఖ్య ఒక్కసారిగా పెరుగుతోంది.

రాజస్థాన్‌లో కొత్తగా మరో 122 కరోనా పాజిటివ్ కేసులు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 17, 2020 | 8:02 PM

రాజస్థాన్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన కొద్ది రోజులుగా వందల్లో కేసులు నమోదవుతున్నాయి. దీంతో కేసులు సంఖ్య ఒక్కసారిగా పెరుగుతోంది. తాజాగా బుధవారం నాడు కొత్తగా మరో 122 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 13,338కి చేరింది. గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి ఒకరు మరణించినట్లు రాజస్థాన్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇక బుధవారం నమోదైన కేసుల్లో భరత్‌పుర్‌లో 28, పాలీలో 25,జైపూర్‌14,జున్‌జుహ్నూలో 14, చురు 16, నాగూర్‌లో 13, సిరోహీ 03, అజ్మీర్‌ 2,అల్వార్‌లో 02, దౌసా,జల్వార్‌, దున్గార్పూర్‌ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2,904 యాక్టివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు.

మరోవైపు దేశ వ్యాప్తంగా కరోనా పాజటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ప్రస్తుతం 3.5 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 1.8 లక్షల మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరో 11వేల మందికి పైగా కరోనా బారినపడి మరణించారు.