తమిళనాడులో 50 వేల మందికి కరోనా…
తమిళనాడులో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు కొత్తగా 2,174 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 50,193కి చేరింది. అటు గడిచిన 24 గంటల్లో ఏకంగా 48 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య 576కి చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో 2,094 మంది స్థానికులు కాగా , 80 మంది విదేశాల నుంచి, […]
తమిళనాడులో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈరోజు కొత్తగా 2,174 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 50,193కి చేరింది. అటు గడిచిన 24 గంటల్లో ఏకంగా 48 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. దీనితో మృతుల సంఖ్య 576కి చేరుకుంది.
కొత్తగా నమోదైన కేసుల్లో 2,094 మంది స్థానికులు కాగా , 80 మంది విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వెనక్కి వచ్చినవారని తమిళనాడు రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజాగా బులిటెన్ విడుదల చేసింది. ఇవాళ ఒక్కరోజే కరోనా నుంచి కోలుకుని 842 డిశ్చార్జ్ అయ్యారని పేర్కొంది. ఇక వివిధ ఆస్పత్రుల నుంచి ఇప్పటివరకు 27,624 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 21,990 మంది వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది.
Tamil Nadu crosses 50,000 mark with 2,174 new #COVID19 cases today, taking the total number of cases to 50,193. Death toll rises to 576 after 48 deaths were reported today: State Health Department pic.twitter.com/IGSnY1cm1K
— ANI (@ANI) June 17, 2020