అమర సైనికులకు మా సెల్యూట్.. క్రికెటర్ల నివాళి

వీరమరణం పొందిన సంతోష్ బాబుకు టీమిండియా సారథి విరాట్ కోహ్లితోపాటు... యువరాజ్ సింగ్, హర్బజన్ సింగ్ క్రికెటర్లు ఈ ఘటనపై స్పందించి అమర జవాన్లకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు....

అమర సైనికులకు మా సెల్యూట్.. క్రికెటర్ల నివాళి
Sanjay Kasula

|

Jun 18, 2020 | 4:20 PM

చైనా-భారత్ సరిహద్దులో ఆరు వారాలుగా చోటుచేసుకున్న ఉద్రిక్తతలు సోమవారం రాత్రి ఘర్షణలుగా మారాయి. ఈ ఘటనలో సూర్యాపటే బిడ్డ కర్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది ఆర్మీ జవాన్లు అమరులయ్యారు. వీరమరణం పొందిన సంతోష్ బాబుకు టీమిండియా సారథి విరాట్ కోహ్లితోపాటు.. . యువరాజ్ సింగ్, హర్బజన్ సింగ్ క్రికెటర్లు ఈ ఘటనపై స్పందించి అమర జవాన్లకు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు.

గాల్వన్ లోయలో ప్రాణాలర్పించిన సైనికులకు వందనాలు. మన సైనికులకు మనస్ఫూర్తిగా సెల్యూట్ చేస్తున్నా…, ఓ సైనికుడి కంటే నిస్వార్థమైన, ధైర్యవంతుడైన వ్యక్తి మరొకరు ఉండరు. వారి కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి. మా ప్రార్ధనలు ఈ పరిస్థితుల్లో వారి కుటుంబీకులకు శాంతిని చేకూర్చాలని ఆశిస్తున్నాం అంటూ కోహ్లి ట్వీట్ చేశారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu