మహిళా క్రికెటర్ ఆత్మహత్య..పలువురి సంతాపం
త్రిపురలో దారుణం చోటుచేసుకుంది.. భారత మహిళల అండర్ -19 జట్టుకు చెందిన క్రీడాకారిణి అయంతి రీయాంగ్ ఆత్మహత్యకు పాల్పడింది...చిన్నప్పటి నుంచి ఆటల్లో చురుగ్గా ఉండే అయంతిని తల్లిదండ్రులు..
త్రిపురలో దారుణం చోటుచేసుకుంది.. భారత మహిళల అండర్ -19 జట్టుకు చెందిన క్రీడాకారిణి అయంతి రీయాంగ్ ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం రాత్రి ఆమె తన నివాసంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. త్రిపుర రాజధాని అగర్తలా నుంచి 90 కిలోమీటర్ల దూరంలోగల ఉదయపూర్ ఏరియాలోని తెనాని అయంతి స్వగ్రామం.
అయంతీ తన తల్లిదండ్రులకు నాలుగో సంతానం. కాగా, చిన్నప్పటి నుంచి ఆటల్లో చురుగ్గా ఉండే అయంతిని తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు. దీంతో, క్రికెట్‌లో ఒక్కోమెట్టు ఎక్కుతూ ఏడాది క్రితం భారత అండర్-19 జట్టుకు ఎంపికైంది. అంతేగాకుండా రాష్ట్రం తరఫున కూడా టి-20 జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నది. త్రిపుర అండర్-23 జట్టులో కూడా ఆమె సభ్యురాలిగా కొనసాగుతున్నది. కాగా, అయంతి మృతిపట్ల పలువురు క్రీడా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రం ప్రతిభావంతురాలైన క్రీడాకారిణిని కోల్పోయిందని త్రిపుర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి తిమురా చందా సంతాపం వ్యక్తం చేశారు.