SpiceJet: చెన్నైలో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. హైదరాబాద్‌కు టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే..
చెన్నై - హైదరాబాద్ స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో టేకాఫ్ అయిన కాసేపటికే మళ్లీ చెన్నై ఎయిర్ పోర్టులోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. అసలు ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ఫుల్ టెన్షన్ పడ్డారు. అయితే ఫ్లైట్ సేఫ్‌గా ల్యాండ్ అవడంతో హమ్మయ్య అనుకున్నారు.

గత కొంతకాలంగా విమాన ప్రమాదాలు ప్రయాణికులకు భయాందోళన కలిగిస్తున్నాయి. గత నెలలో జరిగిన అహ్మదాబాద్ ఘోర ప్రమాదం అందరినీ కలిచివేసింది. ఈ ప్రమాదంలో 250కిపైగా మంది మరణించారు. వారం క్రితం జపాన్ ఫ్లైట్ ఒక్కసారిగా 26వేల అడుగులు కిందికి దిగడంతో లోపలున్న ప్రయాణికులు గజగజ వణికిపోయారు. తాము చనిపోతామని.. తమ ఆస్తుల వివరాలను కుటుంబసభ్యులను మెస్సేజ్ చేశారు. ఇటు దేశంలోనూ పలు విమానాల్లో సాంకేతిక లోపం తలెత్తగా ప్రయాణికులు ఖంగారుపడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా మరో విమానంలో టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చింది. దీంతో టేకాఫ్ అయిన కాసేపటికే మళ్లి అదే ఎయిర్ పోర్టులో ల్యాండ్ అయ్యింది.
చెన్నై నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఫ్లైట్ లో సాంకేతిక లోపం తలెత్తింది. వెంటనే అలర్ట్ అయిన పైలట్..ఫ్లైట్‌ను తిరిగి చెన్నైలో ల్యాండ్ చేశారు. అయితే లోపలున్న ప్రయాణికులకు మాత్రం ఏం జరుగుతుందో కాసేపు అర్ధం కాలేదు. పైలట్ ఫ్లైట్‌లో టెక్నికల్ ప్రాబ్లమ్ వచ్చిందని చెప్పడంతో షాకయ్యారు. చివరకు సేఫ్‌గా ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. విమానం ల్యాండ్ అయ్యాక తమను పట్టించుకునే నాథుడే కరువయ్యారని ప్రయాణికులు ఆరోపించారు. దాదాపు 2 గంటలుగా ఎయిర్ పోర్టులోనే పడిగాపులు కాస్తున్నామని వాపోయారు. ఫ్లైట్‌కు సంబంధించి అధికారుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలంటూ మండిపడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..