Kishan Reddy: సమతామూర్తి విగ్రహంపై రాహుల్ గాంధీ విమర్శలు.. గట్టి కౌంటర్ ఇచ్చిన కిషన్ రెడ్డి..
ముచ్చింతల్‌లో కొలువుదీరిన శ్రీరామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహాన్ని అవమానపరుస్తూ ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు...
ముచ్చింతల్‌లో కొలువుదీరిన శ్రీరామానుజాచార్యుల సమతామూర్తి విగ్రహాన్ని అవమానపరుస్తూ ట్విట్టర్ వేదికగా రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. చైనాలో తయారు చేసిన విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారని విమర్శించిన రాహుల్ గాంధీ. ‘మేడిన్ ఇన్ చైనా’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. ఇక ఆ ట్వీట్‌ను కిషన్ రెడ్డి తప్పుబట్టారు. ట్విట్టర్‌లో ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’కి సంబంధించి నాలుగు అంశాలతో కూడిన వివరణ ఇచ్చారు.
1. ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ అనే ప్రాజెక్ట్ 8 ఏళ్ల క్రిందట ప్రైవేటు ఆధ్యాత్మిక ప్రాజెక్ట్‌గా మొదలైందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
2. ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైనప్పుడు అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని గుర్తు చేశారు.
3. ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ ప్రాజెక్ట్‌కు నిధులు పూర్తిగా(100 శాతం) ప్రైవేటు ఫండ్ రైజింగ్ ద్వారా వచ్చినవేనని.. దీనికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆర్ధిక సహాయాన్ని అందించలేదని స్పష్టం చేశారు.
4. ప్రధాని నరేంద్ర మోడీ ‘ఆత్మనిర్భర్ భారత్’ పిలుపు కంటే ముందే ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారని కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ ప్రాజెక్ట్‌పై రాహుల్ గాంధీ చేసిన ట్వీట్.. కేవలం ఆయన అజ్ఞానాన్ని చాటుకుందని ఎద్దేవా చేశారు. నిజానిజాలను నిర్ధారించుకోకుండా.. కేవలం కల్లబొల్లి కబుర్లు చెబుతూ తన పార్టీని తానే మట్టికరిపిస్తున్నారంటూ సెటైర్లు వేశారు. గతంలో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ(CPC)తో MOU కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందంటూ దెప్పిపొడిచారు.
1. State of Equality is a project of a private spiritual entity conceived 8+ years ago
2. At that time Congress was in power in both centre & state
3. 100% funds were raised privately & GoI provided NO financial support
4. The statue preceded PM’s call for Atmanirbhar Bharat https://t.co/P5ug2uXxsV
— G Kishan Reddy (@kishanreddybjp) February 9, 2022
This trigger-happy tweeting only exposes his own ignorance and shallowness. By blabbering without knowing facts he continues to sink himself and reduce his party to dust.
It’s also quite ironical coming from a party that signed an MoU with the CPC.
— G Kishan Reddy (@kishanreddybjp) February 9, 2022
Also Read:
Viral Photo: ఈ ఫోటోలో పాము దాగుందా.? ఈజీగా కనిపెట్టచ్చండోయ్.! కష్టం కాదు..
Tamil Nadu: కాలువలో తేలియాడుతోన్న సూటుకేసు.. తెరిచి చూడగా పోలీసులకు షాక్..