PM Modi Interview Highlights: ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఇంటర్యూ.. లైవ్ అప్‌డేట్స్ మీకోసం..
PM Modi Interview UP Polls Live: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవాళ ప్రసారం కానుంది. భారత కాలమానం ప్రకారం..
PM Modi Special Interview: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. జాతీయ మీడియా ఏజెన్సీ ఏఎన్ఐ కి ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు సహా అనేక అంశాలపై స్పందించారు. ఎన్నికల్లో బీజేపీనే గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ పార్టీపై చేసిన కామెంట్స్‌కు వివరణ ఇచ్చారు. వారసత్వ రాజకీయాలు, అవినీతి, దేశాభివృద్ధి, విపక్షాల తీరు, రైతు చట్టాలు, రైతులను వాహనాలతో తొక్కించడం వంటి అంశాలపై ప్రధాని స్పందించారు.
ప్రధాని మోదీని ఎన్ఐఏ న్యూస్ ఏజెన్సీ ప్రతినిధి స్మితా ప్రకాశ్ ఇంటర్వ్యూ చేయగా.. అనేక అంశాలపై తనదైన శైలిలో సమాధానాలు చెప్పారు. 70 నిమిషాల పాటు సాగిన ఇంటర్వ్యూలో ఎక్కువగా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడారు. 5 రాష్ట్రాల ఎన్నికల్లో కమలం వికసిస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.
కాగా, ఉత్తరప్రదేశ్, గోవా, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ రేపు జరగనుంది. ఇలాంటి తరుణంలో ప్రధాని మోదీ ప్రత్యేక ఇంటర్వ్యూపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రధాని ఏం అంశాన్ని ప్రస్తావిస్తారు? ఏం మాట్లాడుతారు? పొలిటికల్‌గా ఏమైనా కామెంట్స్ చేస్తారా? దేశాభివృద్ధిపై మాట్లాడుతారా? అనే దానిపై ఆసక్తిగా ఎదురు చూశారు ప్రజలు.
PM Narendra Modi’s interview with ANI’s Smita Prakash on several issues including Assembly elections 2022, to be played at 8pm today. The duration of the interview is 70 minutes. pic.twitter.com/s3CB853UDv
— ANI (@ANI) February 9, 2022
ప్రధాని మోదీ ఇంటర్వ్యూ వీడియో:
LIVE NEWS & UPDATES
-
అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోను..
పాలనలో అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో సహించబోనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కులాల వారీగా అసెంబ్లీ టికెట్లు ఇవ్వకుండా సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ దిశగా సాగుతామని అన్నారు.
-
రైతు చట్టాలపై స్పందించిన ప్రధాని మోదీ..
నూతన వ్యవసాయ చట్టాలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. రైతులకు మేలు చేసేందుకే వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చామని అన్నారు. కానీ, దేశ ప్రయోజనాల దృష్ట్యా వాటిని వెనక్కి తీసుకున్నామని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.
-
-
పేదల సంక్షేమమే మా లక్ష్యం..
పేదల కోసమే మా ప్రభుత్వం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పేదలకు ఆహారం, ఇళ్లు, టాయిలెట్లు, మంచినీరు, రోడ్లు, మెరుగైన వైద్యం అందించడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు. చిన్న సన్నకారు రైతులకు మేలు చేయడమే తన బాధ్యత అని అన్నారు.
-
కుటుంబ రాజకీయాలపై కీలక కామెంట్స్..
రాజకీయ పార్టీ ఓ కుటుంబం చేతిలో ఉండటం ప్రమాదకరం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వారసత్వ రాజకీయాలు దేశానికి ప్రమాదకరమన్నారు. తాను, వాజ్‌పేయి తప్ప దేశాన్ని పాలించింది కాంగ్రెస్సే అని అన్నారు. కాంగ్రెస్ పాలన అంతా అవినీతిమయం అని విమర్శించారు. అభివృద్ధిపై దృష్టి పెడితే చాలా ముందుకెళ్లేవాళ్లం అని అన్నారు.
-
ప్రజలకు సేవ చేయడంలో బీజేపీ ఎప్పుడూ ముందుంటుంది..
ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లోనూ బీజేపీకే అనుకూల ప్రభావం ఉందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. పాత సిద్ధాంతాలను యూపీ ప్రజలు ఎప్పుడో దూరంగా విసిరేశారని అన్నారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకుపైనే దృష్టి పెట్టాయని అన్నారు. ప్రజలకు సేవ చేయడంలో బీజేపీ ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజా సంక్షేమమే తమ నినాదం అన్నారు.
-
-
గత ప్రభుత్వాలపై విమర్శల వర్షం..
గత ప్రభుత్వాలు అభివృద్ధిపై ఏ రోజూ దృష్టి పెట్టలేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. తాను కార్యకర్తల కంటే పెద్ద వ్యక్తిని కాదని, తానూ కార్యకర్తనే అని పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యం అని, రాష్ట్రాల ఆకాంక్షలు నెరవేరినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఒకప్పటి సీఎంగా రాష్ట్రాల ఆకాంక్షలను అర్థం చేసుకోగలుగుతానని అన్నారు. అన్ని రాష్ట్రాలకు ప్రపంచ గుర్తింపు తెచ్చామని మోదీ పేర్కొన్నారు.
-
భిన్నత్వంలో ఏకత్వం మా విధానం..
దేశంలో కొందరు విభజించు పాలించు పాలసీని అమలు చేశారని విపక్ష పార్టీలపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. తాము మాత్రం భిన్నత్వంలో ఏకత్వాన్ని నమ్ముతున్నామని అన్నారు.
-
లఖీంపూర్ కేరీ ఘటనపై ప్రధాని స్పందన..
ఉత్తరప్రదేశ్‌లోని లఖీంపూర్ కేరీలో రైతులను కార్లతో తొక్కించడంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. సుప్రీంకోర్టు విచారణకు యూపీ సర్కార్ సహకరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తోందన్నారు.
-
పార్లమెంట్‌లో తన వ్యాఖ్యలకు మోదీ వివరణ..
పార్లమెంట్‌లో తాను చేసిన వ్యాఖ్యలకు ప్రధాని నరేంద్ర మోదీ వివరణ ఇచ్చారు. తాను ఎవరినీ కించపరిచే ఉద్దేశ్యంతో వ్యాఖ్యలు చేయలేదన్నారు. తాను ఎవరి తండ్రిని, తాతను కించపరచలేదన్నారు. మాజీ ప్రధాని అన్న వ్యాఖ్యలనే తాను చెప్పానని మోదీ పేర్కొన్నారు. అప్పటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులను వివరించే ప్రయత్నం చేశానన్నారు. నెహ్రూను ఎప్పుడూ గుర్తు చేసుకోలేదంటారు. మాట్లాడితే చాలు ఏదో రకంగా కాంట్రవర్సీ చేస్తారని విపక్షాల తీరును తప్పుపట్టారు. అంత భయం ఎందుకు వారికి అంటూ ప్రశ్నించారు.
-
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కమలం వికసిస్తుంది…
ప్రస్తుతం జరుగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కమలం వికసిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. బీజేపీ డబుల్ ఇంజన్ సర్కారుపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందన్నారు.
-
ఆరో వికెట్ కోల్పోయిన భారత్..
దీపక్ హుడా బౌలింగ్‌లో బ్రూక్స్(44) సూర్యకుమార్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 30.5 ఓవర్లలో 117 పరుగుల వద్ద 6వ వికెట్‌ను కోల్పోయింది.
Published On - Feb 09,2022 7:13 PM