Covid Vaccine: భారత్‌లో అందుబాటులోకి 9వ వ్యాక్సిన్‌.. కంపెనీల సేల్స్ పెంచేందుకే అంటోన్న నిపుణులు

బూస్టర్ షాట్ ఆలోచన హాస్యాస్పదంగా ఉంది. వ్యాక్సిన్ వ్యాపారంలో ఉన్నవారికి మాత్రమే ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువ మంది తయారీదార్లు ఉండటంతో..

Covid Vaccine: భారత్‌లో అందుబాటులోకి 9వ వ్యాక్సిన్‌.. కంపెనీల సేల్స్ పెంచేందుకే అంటోన్న నిపుణులు
Teens Covid Vaccine
Follow us
Venkata Chari

|

Updated on: Feb 09, 2022 | 7:46 PM

Omicron: దేశంలో పెరుగుతున్న కరోనా మహమ్మారి(Coronavirus) విస్తరిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ అత్యంత శక్తివంతమైన ఆయుధంగా నిపుణులు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈమేరకు దేశంలోని ప్రతి పౌరుడు కోవిడ్ వ్యాక్సిన్‌(Covid Vaccine)ను తప్పక తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. కరోనాతో జరుగుతున్న ఈ యుద్ధంలో భారతదేశంలో మొత్తం తొమ్మిది వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. తాజాగా స్పుత్నిక్ లైట్ల(Sputnik Light) అత్యవసర వినియోగాన్ని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(DCGI) ఆమోదించడంతో తొమ్మిదొవ వ్యాక్సిన్‌కు అనుమతి లభించింది. ఈమేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ట్వీట్ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు.

వ్యాక్సిన్ మిగులు అనేది ఒక సమస్య కాదని భారతదేశపు అత్యున్నత ఎపిడెమియాలజిస్ట్, ICMR NIE సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ ఛైర్మన్ డాక్టర్ జయప్రకాష్ ములియిల్ పేర్కొన్నారు. “చాలా వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రాథమిక మోతాదుల కోసం అవసరం లేని వారికి కూడా బూస్టింగ్ డోస్ తప్పనిసరిగా చేస్తారేమోనని నేను భయపడుతున్నానంటూ పేర్కొన్నారు. సైన్స్ ప్రకారం, ఇన్‌ఫెక్షన్, టీకా రెండూ ప్రజలకు నిజమైన టీ-సెల్ మెమరీని అందిస్తాయి. బూస్టింగ్‌ డోస్‌ను కొనసాగించాల్సిన అవసరం లేదు. బూస్టర్ షాట్ ఆలోచన హాస్యాస్పదంగా ఉంది. వ్యాక్సిన్ వ్యాపారంలో ఉన్నవారికి మాత్రమే ఇది ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువ మంది తయారీదార్లు ఉండటంతో వారి వ్యాక్సిన్ అమ్మకాలను పెంచే ప్రయత్నం చేస్తాయి” అని ఆయన తెలిపారు.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యునాలజీలో శాస్త్రవేత్త డాక్టర్ వినీతా బాల్‌ కూడా ఇదే విషయాన్ని అంగీకరించారు. “వ్యాక్సిన్ నిల్వలు, వృధా, సేల్స్ నుంచి జాగ్రత్త వహించాలి. భారతదేశంలో ఏ వర్గానికి పలు కంపెనీల బూస్టర్ డోస్‌లను అందించాలనే ఆధారాలు లేవు. బూస్టర్ డోస్ విషయంలో ముందుకు వెళ్లడానికి మేం కచ్చితమైన డేటా కోసం వేచి ఉండాలి. ఈ గ్యాప్‌లోనే తయారీదారులు ఇతర దేశాలకు వ్యాక్సిన్‌లను పంపేలా ప్రోత్సహించాలి. ఇతర రకాల వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ చేస్తూ ఉండాలి. ఫలితాలు అనుకూలంగా ఉంటే, ఇప్పటికే టీకాలు వేసిన జనాభాను ఎక్కువగా గుమికూడకుండా చూడాలని” ఆమె తెలిపారు.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా డేటా ప్రకారం, భారతదేశంలో అర్హత ఉన్న జనాభాలో 77 శాతం మంది పూర్తిగా టీకాలు వేసుకున్నారు. ఇందులో 95 శాతం మంది కనీసం ఒక డోస్ పొందిన జాబితాలో ఉన్నారు. ఇప్పటివరకు 1,41,57,126 బూస్టర్ డోస్‌లు అందించారు. 15 నుంచి 18 సంవత్సరాల కేటగిరీలో 65 శాతం కంటే ఎక్కువ మంది కౌమారదశలో ఉన్న వారికి కూడా మొదటి డోస్ టీకాను పొందారు. ఇప్పటివరకు టీకాలు వేసిన జనాభాలో, 93 శాతం కంటే ఎక్కువ మంది సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన కోవిషీల్డ్‌ను పొందారు. మిగిలిన జనాభాలో 5 శాతం మంది ఇప్పటి వరకు భారత్ బయోటెక్ కోవాక్సిన్‌ టీకాను పొందారు.

కాగా, భారతదేశంలో ఇంకా 43 మిలియన్ల మంది పెద్దలు వారి మొదటి డోస్ టీకాను అందుకోవలసి ఉంది. 2020లో నిర్వహించిన తాజా డెమోగ్రాఫిక్స్ అధ్యయనం ప్రకారం, మన మొత్తం జనాభాలో దాదాపు 41 శాతం మంది 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యువకులే ఉన్నారు. అంటే మొత్తం జనాభాలో గణనీయమైన శాతం మంది ఇంకా COVID వ్యాక్సిన్‌ను పొందలేదు. ICMR నుంచి డాక్టర్ సమీరన్ పాండా మాట్లాడుతూ, ఈ దశలో మరిన్ని వ్యాక్సిన్‌ల కోసం DCGI ఆమోదం అందిస్తు్న్నందున.. వ్యాక్సిన్ లభ్యతపై ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

” 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు టీకాలు వేయడం కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. ఆపై అర్హులైన జనాభాకు అందించాల్సిన బూస్టర్ డోస్ మోతాదులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎంత ఎక్కువ వ్యాక్సిన్‌లు వేస్తే అంత మంచిది” అని డాక్టర్ సమీరన్ పాండా అన్నారు. అలాగే “భారతదేశం అంతటా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కానీ, మేం కోవిడ్‌ను తేలికగా తీసుకోలేం. శాస్త్రవేత్తలు ఉత్పరివర్తనాలను నిశితంగా గమనిస్తున్నారు”అని ఆయన తెలిపారు.

ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ చంద్రకాంత్ లహరియా మాట్లాడుతూ, మనకు మళ్లీ మళ్లీ వైరస్ సోకే అవకాశం ఉందని తెలిపారు. “మనం ప్రతి 6 నెలలకోసారి వ్యాక్సిన్ తీసుకోవలసిన పరిస్థితి ఉండవచ్చు. మనం SARS CoV2తో జీవించవలసి ఉంటుంది. ఇక్కడ ప్రతి 2-3 సంవత్సరాలకు మళ్లీ వ్యాధి సోకే అవకాశం ఉంది” అని ఆయన తెలపారు.

అందుబాటులో తొమ్మిది టీకాలు: NTAGI చీఫ్ రష్యా గమలేయా సెంటర్ ద్వారా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ లైట్ హ్యుమన్ అడెనోవైరస్ వెక్టర్ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించారు. రోగనిరోధక ప్రతిచర్యను ప్రేరేపించడానికి ప్రాక్సీ, హానిచేయని వైరస్ ద్వారా దీనిని తయారు చేశారు. ఈ వ్యాక్సిన్ ఒమిక్రాన్ వేరియంట్‌కు వ్యతిరేకంగా బూస్టర్ డోస్‌గా ప్రభావవంతంగా ఉంటుందని పేర్కొన్నారు. “గమలేయ కేంద్రం ప్రాథమిక అధ్యయనంలో స్పుత్నిక్ లైట్ సెరా ఆధారంగా ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా పోరాడుతుందని, 2-3 నెలల తర్వాత 100 శాతం మంది వ్యక్తులు ఈ వేరియంట్‌కు వ్యతిరేకంగా న్యూట్రలైజింగ్ యాంటీబాడీలను అభివృద్ధి చేసినట్లు” RDIF పేర్కొంది.

ఈ కొత్త వ్యాక్సిన్ ఆమోదాన్ని ప్రశంసిస్తూ, NTAGI (నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్) చీఫ్ డాక్టర్ ఎన్‌కె అరోరా మాట్లాడుతూ, త్వరలో వ్యాక్సిన్‌లు ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. “ఈ వ్యాక్సిన్‌లు బహిరంగ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏది అనుకూలంగా లేదా తక్కువ ధరలో ఉంటుందో దానిని ఎంచుకోవచ్చు. అనేక వ్యాక్సిన్‌లను ఆమోదించడం వెనుక ఉన్న ఆలోచన కూడా ఇదేనని” ఆయన పేర్కొన్నారు.

సెంట్రల్ డ్రగ్స్ లాబొరేటరీ (CDL) ప్రకారం, ఫిబ్రవరి 15 నుంచి జనాభాకు అందుబాటులో ఉండే 6 కోట్ల కార్బెవాక్స్ డోస్‌ల స్టాక్‌ను క్లియర్ చేసింది. ప్రస్తుతం భారత్ బయోటెక్ కోవాక్సిన్‌పై మాత్రమే ఆధారపడిన టీనేజర్లకు ఈ టీకాలు వేయడానికి ప్రభుత్వం చేస్తున్న డ్రైవ్‌లో ఇది చేరే అవకాశం ఉంది. Corbevax కాకుండా, 3.15 కోట్ల డోస్‌ల Covovax (సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాచే తయారైన ఒక అమెరికన్ వ్యాక్సిన్) భారతదేశంలో బయోలాజికల్ ఈ ద్వారా తయారైన జాన్సన్ & జాన్సన్ సింగిల్-షాట్ COVID-19 వ్యాక్సిన్‌కు సంబంధించి 1.85 కోట్ల డోస్‌లను కూడా క్లియర్ చేసింది.

“ఈ వ్యాక్సిన్‌ల తయారీలో కొంత జాప్యం జరిగింది. కానీ, ఆ ప్రక్రియను నిందించలేం. ఇది చాలా పారదర్శకంగా ఉంటుంది. కానీ, ప్రతి దేశానికి సంబంధించిన వ్యాక్సిన్ క్లియరెన్స్ పొందడం చాలా కష్టమైన ప్రక్రియ. మేం కోవిడ్ వ్యాక్సిన్‌లతో సంతృప్తి చెందలేం” అని డాక్టర్ అరోరా పేర్కొన్నారు.

కానీ, భారతదేశంలో ఉపయోగానికి ఎక్కువ అవకాశం లేకపోవడంతో, తయారీదారులు కూడా వ్యాక్సిన్ ఎగుమతి ఆలోచనను అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం, Covovax ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి చేస్తున్నారు. డబ్ల్యూహెచ్ఓ మద్దతుగల COVAX, J&J వ్యాక్సిన్‌లు కూడా ఎగుమతి అవుతున్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం, ఫార్మా కంపెనీ మధ్య చర్చలు పరస్పర అవగాహనకు రావడంలో విఫలమయ్యాయి.

భారతదేశంలో స్పుత్నిక్ లైట్ ఆమోదంతో, ప్రపంచవ్యాప్తంగా 2.5 బిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు ఒక డోస్ వ్యాక్సిన్‌గా, అలాగే “యూనివర్సల్ బూస్టర్”గా యాక్సెస్ చేయగలరని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (RDIF) తెలిపింది. “స్పుత్నిక్ లైట్ మొత్తం 2.5 బిలియన్ల జనాభాతో 30 కంటే ఎక్కువ దేశాల్లో నమోదైంది. అర్జెంటీనా, బహ్రెయిన్, యూఏఈ, శాన్ మారినో, ఫిలిప్పీన్స్‌తో సహా అనేక దేశాలు ఇప్పటికే స్పుత్నిక్ లైట్‌ను యూనివర్సల్ బూస్టర్‌గా ఆమోదించాయి” అని RDIF పేర్కొంది.

“భవిష్యత్తులో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి టీకా సురక్షితమైన మార్గం. మరణాలు కూడా పెరుగుతాయి. అయితే వీటి సంఖ్యను పెరగకుండా నివారించాలి” అని డాక్టర్ షాహిద్ జమీల్ అన్నారు. వ్యాక్సిన్ తయారీదారులు తమ పక్షంలో ఆలస్యం జరిగిందని అంగీకరిస్తున్నప్పటికీ, కొత్త వ్యాక్సిన్‌ల ఉపయోగం బూస్టర్‌లుగా లేదా పిల్లలలో మాత్రమే సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.

మీడియా నివేదిక ప్రకారం, DCGI సభ్యులు డేటాను సమీక్షిస్తారు. ప్రస్తుతం టీనేజర్లకు అందిస్తోన్న భారత్ బయోటెక్ కోవాక్సిన్‌లో అందుబాటులో ఉన్న డేటాతో పోల్చి చూస్తారు. ఈ రెండు టీకాలు ఫలితాలు తగినంత మేరకు ఉంటే, కోవాక్సిన్ పరిమిత ఉత్పత్తి, ప్రాథమిక టీకా ప్రణాళికలు, బూస్టర్ డోస్‌లలో దాని అవసరం కారణంగా భారతదేశంలో పిల్లలకు మరిన్ని టీకాలు అవసరం కాబట్టి వాటిని ఆమోదించే అవకాశం ఉంది.

“మేం భారత్ బయోటెక్ ద్వారా ముక్కు నుంచి అందించే వ్యాక్సిన్‌ను కూడా నిశితంగా పరిశీలిస్తున్నాం. అది కోవిడ్‌పై మా పోరాటంలో గేమ్ ఛేంజర్‌గా మారవచ్చు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ కూడా త్వరలో ఒమిక్రాన్ నిర్దిష్ట వ్యాక్సిన్‌ని పరిశీలిస్తోంది. ఇలాంటి ఎంపికలు ఇచ్చినట్లయితే ఎలాంటి సమస్య కనిపించడం లేదు” అంటూ పేర్కొన్నారు.

Also Read: PM Modi Interview Live: మరికాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక ఇంటర్యూ.. లైవ్ అప్‌డేట్స్ మీకోసం..

Kishan Reddy: సమతామూర్తి విగ్రహంపై రాహుల్ గాంధీ విమర్శలు.. గట్టి కౌంటర్‌ ఇచ్చిన కిషన్ రెడ్డి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!