Viral Photo: ఈ ఫోటోలో పాము దాగుందా.? ఈజీగా కనిపెట్టచ్చండోయ్.! కష్టం కాదు..

ఫోటో పజిల్స్.. వీటికి ఈ మధ్యకాలంలో నెటిజన్లు బాగా ఆకర్షితులవుతున్నారు. కొన్ని ఫోటోలు మనల్ని మంత్ర ముగ్దులను చేస్తే..

Viral Photo: ఈ ఫోటోలో పాము దాగుందా.? ఈజీగా కనిపెట్టచ్చండోయ్.! కష్టం కాదు..
Snake
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 08, 2022 | 8:41 AM

ఫోటో పజిల్స్.. వీటికి ఈ మధ్యకాలంలో నెటిజన్లు బాగా ఆకర్షితులవుతున్నారు. కొన్ని ఫోటోలు మనల్ని మంత్ర ముగ్దులను చేస్తే.. మరికొన్ని మన కళ్లను మోసం చేస్తుంటాయి. ఇలాంటి చిత్రాలు సోషల్ మీడియాలో చాలానే కనిపిస్తాయి. వీటినే ఫోటో పజిల్స్ అని అంటారు. సోషల్ మీడియాలో ఫోటో పజిల్స్ కోసం ప్రత్యేకంగా పేజీలు  కూడా ఉన్నాయి. ఇక నెటిజన్లు ఆ ఫోటోలో ఏముందో కనిపెట్టేందుకు తమ మెదడుకు మేత వేస్తారు. తగ్గేదేలే అన్నట్లుగా పజిల్‌ను సాల్వ్ చేస్తుంటారు. తాజాగా ఓ ఫోటో పజిల్ నెటిజన్లను కట్టిపడేస్తోంది. అదేంటో చూసేద్దాం..

పైన పేర్కొన్న ఫోటోలో ఓ పాము దాగుంది. అదెక్కడుందో కనిపెట్టి చెప్పాలి. ఏదో ఊరికే ఫోటోను చూస్తే పామును కనిపెట్టలేరు. మీ కళ్ళకు కాస్త పదునుపెడితే చిటికెలో గుర్తించగలరు. కాక్టస్(Cactus) మొక్కలు చుట్టూ గుబురుగా పెరిగి ఉండటంతో మీ దృష్టంతా వాటిపై పడుతుంది. చాలామంది ఈ పజిల్‌ను టక్కున సాల్వ్ చేసేశారు. సమాధానాన్ని కామెంట్స్ రూపంలో తెలిపారు. ఇంకొందరైతే పజిల్‌ను సాల్వ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. మరి మీరు కూడా ట్రై చేయండి. ఆన్సర్ దొరక్కపోతే క్రింద ఫోటో చూడండి..