Corona Alert: కరోనా ప్రమాదం ముంచుకొస్తోంది.. జాగ్రత్త..! తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు కేంద్రం హైఅలర్ట్‌..

తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయంటూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వికి లేఖ రాసింది. గత రెండు వారాలుగా రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని స్పష్టం చేసింది.

Corona Alert: కరోనా ప్రమాదం ముంచుకొస్తోంది.. జాగ్రత్త..! తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలకు కేంద్రం హైఅలర్ట్‌..
Corona Virus
Follow us

|

Updated on: Mar 16, 2023 | 8:01 PM

కరోనావైరస్ వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం మరోసారి హైఅలర్ట్‌ జారీ చేసింది. ఆరు రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది. గుజరాత్, మహారాష్ట్ర , తెలంగాణ , కర్నాటక , కేరళ ప్రభుత్వాలకు లేఖ రాసింది. టెస్టింగ్‌ ,ట్రీట్‌మెంట్‌ , ట్రాకింగ్‌ , వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టాలని కేంద్ర ఆరోగ్యశాఖ కోరింది. ఓవైపు ఫ్లూజ్వరాలు విజృంభిస్తున్న వేళ.. కేంద్రం కరోనా అలర్ట్‌ జారీ చేయడంతో మళ్లీ మహమ్మారి వేవ్‌ తప్పదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రజలు మళ్లీ కరోనా నిబంధనలు పాటించాలని చెబుతోంది ఐసీఎంఆర్‌. ఈ నేపథ్యంలో కేంద్రం.. రాష్ట్రాలను అప్రమత్తం చేస్తూ లేఖను రాసింది.

తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయంటూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వికి లేఖ రాసింది. గత రెండు వారాలుగా రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని స్పష్టం చేసింది. ఈ నెల 8 వ తేదీ నాటికి కేవలం 132 ఉన్న కోవిడ్ కేసులు.. 15వ తేదీ నాటికి 267కి చేరడం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. మరి ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలోనే అత్యధికంగా కేసులు వెలుగు చూస్తున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో కోవిడ్ నియంత్రణకు జిల్లా స్థాయినుంచి కార్యాచరణ ప్రారంభించాలని కేంద్రం సూచించింది. ముఖ్యంగా ఎక్కడికక్కడ టెస్ట్ లు చేయడంతో పాటు.. కాంటాక్ట్ లను ట్రేస్ చేయడం, బాధితులకు చికిత్స అందించాలని కోరింది. కోవిడ్ నియంత్రణలో భాగంగా వ్యాక్సినేషన్ ని అమలు చేయాలని ఆదేశించింది.

దేశంలోనూ గత కొన్ని వారాలుగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయన్న ఆరోగ్య శాఖ.. మార్చ్ 8 నాటికి దేశ వ్యాప్తంగా 2082 కోవిడ్ కేసులు ఉండగా… ఈ నెల 15 నాటికి ఆ సంఖ్య 3264 కి పెరిగిందని స్పష్టం చేసింది. తెలంగాణ సహా కేస్ లు ఎక్కువగా నమోదు అవుతున్న రాష్ట్రాలు తప్పక టెస్ట్ ల నిర్వహణ, కొత్త కేస్ లు ఎక్కువగా వస్తున్న క్లస్టర్స్ ని మానిటర్ చేయడం, విదేశాల నుంచి వస్తున్న వారి శాంపిల్లను జీనోమ్ సీక్వెన్స్ కి పంపడం సహా.. ఫ్లూ లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చే వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని కోరింది.డెడికేటెడ్ ఫీవర్ క్లినిక్ లను ఏర్పాటు చేసి రోగుల ముందస్తు లక్షణాలను గుర్తించాలని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..

సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
సైక్లింగ్ మీ జీవితాన్నే మార్చేస్తుంది.. ప్రయోజనాలు తెలిస్తే..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
ట్యాక్స్ కొత్త, పాత విధానాలతో గందరగోళంగా ఉందా? ఇది ట్రై చేయండి..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ స్పృహకోల్పోయిన కేంద్ర మంత్రి..
మీకో కిర్రాక్ పజిల్.! ఈ ఫోటోలో కుందేలును గుర్తిస్తే మీరే ఖతర్నాక్
మీకో కిర్రాక్ పజిల్.! ఈ ఫోటోలో కుందేలును గుర్తిస్తే మీరే ఖతర్నాక్
SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..
SRH vs RCB Live: మరోసారి రికార్డ్ స్కోర్‌పై కన్నేసిన హైదరాబాద్..
పుచ్చకాయ చికెన్ బిర్యానీ ఇదేంటేస్టు మహాప్రభో బతకనివ్వండి మమ్మల్ని
పుచ్చకాయ చికెన్ బిర్యానీ ఇదేంటేస్టు మహాప్రభో బతకనివ్వండి మమ్మల్ని
సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
సునీల్ హీరో అంటే ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్స్ నో చెప్పారట..!
వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వింది వీళ్లేనా..? షాకింగ్ వీడియోవైరల్
వందేభారత్ రైలుపై రాళ్లు రువ్వింది వీళ్లేనా..? షాకింగ్ వీడియోవైరల్
ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..
ఆ సమయంలో కొబ్బరినీళ్లు తాగితే అద్భుత ఔషధమే.. ప్రయోజనాలు డబుల్..
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
పదే పదే మీ ప్రియుణ్ణి కలవరిస్తున్నారా ? ఈ వ్యాధి బాధితులు కావచ్చు
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!