Bipin Rawat: ఒకే చితిపై భార్యాభర్తలు ఇద్దరూ.. ముగిసిన జనరల్ బిపిన్ రావత్ అంత్యక్రియలు..కన్నీటితో వీడ్కోలు చెప్పిన దేశం!

భారత దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక భౌతికకాయాలకు ఒకే చితిపై తుది వీడ్కోలు పలికారు.

Bipin Rawat: ఒకే చితిపై భార్యాభర్తలు ఇద్దరూ.. ముగిసిన జనరల్ బిపిన్ రావత్ అంత్యక్రియలు..కన్నీటితో వీడ్కోలు చెప్పిన దేశం!
Bipin Rawat Last Rites
Follow us
KVD Varma

|

Updated on: Dec 10, 2021 | 7:11 PM

Bipin Rawat: భారత దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక భౌతికకాయాలకు ఒకే చితిపై తుది వీడ్కోలు పలికారు. ఇద్దరు కుమార్తెలు , కృతిక, తారిణి కలిసి వారికి అంత్య క్రియలు నిర్వహించారు. జీవిత ప్రయాణంలాగే, జనరల్ రావత్ చివరి ప్రయాణం కూడా అపూర్వమైనది. ఆయనతో కలిసి ఏడడుగులు నడిచిన సతీమణి ఆయన తోడుగానే వెళ్ళిపోయారు.

సైనికా.. సెలవికా అంటూ CDS బిపిన్‌ రావత్‌కు భారతావని కన్నీటి వీడ్కోలు పలికింది. యావత్‌ ప్రజానీకం రావత్‌కు నివాళి అర్పించింది. మీ త్యాగం మరువలేనిదంటూ రావత్‌ సేవల్ని స్మరించుకుంది అఖండ భారత్‌. ఢిల్లీ కంటోన్మెంట్‌ లోని బ్రార్‌ స్క్రేర్‌ స్మశాన వాటికలో జనరల్‌ బిపిన్‌ రావత్‌ , ఆయన భార్య మధులిక రావత్‌ అంత్యక్రియలు ముగిశాయి. కూతుళ్లు కృతిక , తరుణి చితికి నిప్పంటించారు. సైనిక లాంఛనాలతో జనరల్‌ రావత్‌ దంపతుల అంత్యక్రియలు జరిగాయి.

రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ , త్రివిధదళాధిపతులు , ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు పలువురు ప్రముఖులు అంత్యక్రియలకు హాజరయ్యారు. జనరల్‌ రావత్‌ గౌరవార్థం 17 తోప్‌ల సెల్యూట్‌ చేశారు. వేలాదిమంది జనం జనరల్‌ రావత్‌కు తుది వీడ్కోలు పలికారు. త్రివిధ దళాలకు చెందిన 800 మంది సైనికుల ఆధ్వర్యంలో అంత్యక్రియలను నిర్వహించారు.

జనరల్‌ రావత్‌ నివాసం నుంచి బ్రార్‌ స్క్వేర్‌ స్మశానవాటిక వరకు అంతిమయాత్ర సాగింది. భారత్‌మాతాకీ జై అంటూ ప్రజలు ఆయనకు నివాళి అర్పించారు. అంతిమయాత్రలో పాల్గొన్నారు. సూర్యుడు , చంద్రుడు ఉన్నంత కాలం మీ పేరు చిరస్థాయిలో మీ పేరు నిలిచిపోతుందని నినాదాలు చేశారు. శ్రీలంక,బంగ్లాదేశ్‌ , నేపాల్‌ , భూటాన్‌కు చెందిన ఆర్మీ కమాండర్లు అంత్యక్రియలు హాజరయ్యారు.

దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమించిన మహోన్నత వ్యక్తి బిపిన్‌ రావత్‌. దేశానికి తొలి CDSగా సేవలందించారు. విధి నిర్వహణలోనే అమరుడయ్యారు. బిపిన్‌ ఇక లేరని తలుచుకొని విషాదంలో మునిగిపోయింది యావత్‌ దేశం. తమిళనాడు లోని కున్నూరు దగ్గర జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో జనలర్‌ రావత్‌తో పాటు ఆయన భార్య మధులిక , 11 మంది ఆర్మీ సిబ్బంది చనిపోయిన విషయం తెలిసిందే.

హెలికాప్టర్‌ దుర్ఘటనలో దుర్మరణం చెందిన బిపిన్‌ రావత్‌ అంత్యక్రియలు ముగిశాయి. సైనిక లాంఛనాల మధ్య రావత్‌ అంత్యక్రియలు జరిగాయి. అశ్రునయనాల మధ్య రావత్‌కు తుది వీడ్కోలు పలికింది ఆర్మీ. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన ఆర్మీ అధికారులకు టీవీ9 టీమ్‌ ఘన నివాళి అర్పించింది. హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌, చార్మినార్‌, హైటెక్స్‌, పీపుల్‌ ప్లాజాలో ఆర్మీ అధికారుల చిత్రపటాలను ఏర్పాటు చేసింది టీవీ9. ఆర్మీ ఉన్నతాధికారుల చిత్రపటాలకు నగర వాసులు బరువెక్కిన హృదయంతో నివాళి అర్పించారు. చిత్రపటాల దగ్గర పుష్పగుచ్ఛాలు ఉంచి ఆర్మీ ఆఫీసర్స్‌ త్యాగాల్ని స్మరించుకున్నారు.

నివాళులర్పించేందుకు షా, దోవల్..

ఈ ఉదయం నుంచి జనరల్ రావత్, అతని భార్య మధులికా రావత్ భౌతికకాయాలను ప్రజల చివరి సందర్శనార్థం వారి నివాసంలో ఉంచారు. జనరల్ రావత్‌కు నివాళులర్పించేందుకు హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా కేంద్ర కేబినెట్ సభ్యులు వచ్చారు.

ముగిసిన బ్రిగేడియర్ లిద్దర్ అంత్యక్రియలు

ఇక తమిళనాడులోని కూనూర్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో CDS జనరల్ బిపిన్ రావత్‌తో పాటు ప్రాణాలు కోల్పోయిన ఆయన సలహాదారు బ్రిగేడియర్ L.S. ఢిల్లీ కాంట్‌లోని బ్రార్ స్క్వేర్‌లో లిద్దర్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల సమయంలో, లిడర్ భార్య అతని శవపేటికను ముద్దుపెట్టుకుని పదేపదే ఏడ్చింది. లిద్దర్ కుమార్తె తన ధైర్యవంతుడైన తండ్రికి నిప్పు పెట్టింది. బ్రిగేడియర్ లిద్దర్ భార్య గీతిక మాట్లాడుతూ, నాకు ఇది చాలా నష్టం, కానీ నేను సైనికుడి భార్యను. వారికి నవ్వుతూ మంచి వీడ్కోలు పలకాలి. జీవితం చాలా పెద్దది. ఇప్పుడు దేవుడు అనుమతిస్తే, మేం దానితో జీవిస్తాము. ఆయన చాలా మంచి తండ్రి. కూతురు ఆయన్ని చాలా మిస్ అవుతుంది. అని అన్నారు. తర్వాత, ఆమె లిద్దర్ భౌతిక కాయంపై త్రివర్ణ పతాకాన్ని ఉంచింది.

ఈ ఉదయం ఆయన మృతదేహాన్ని ఆర్మీ బేస్ హాస్పిటల్ నుంచి శంకర్ విహార్‌లోని ఆయన నివాసానికి తరలించారు. దీని తరువాత, అతని అంత్యక్రియలు ఢిల్లీ కాంట్‌లోని బ్రార్ స్క్వేర్‌లో జరిగాయి. ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరి కుమార్, ఎయిర్ స్టాఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వి.ఆర్. చౌదరి హాజరు అయ్యారు. ఢిల్లీ కాంట్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.

ఇవి కూడా చదవండి: Indian Railways: ఇక రైళ్లలో ప్రయాణిస్తే.. విమానం తరహా సదుపాయాలు.. ప్రయాణీకులను పలకరించనున్న హోస్టెస్‌లు!

Fine on Amazon: ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌కు భారీ జరిమానా.. ఎందుకంటే..

LIC: ఇండస్ ఇండ్ బ్యాంకులో వాటా పెంచుకోనున్న ఎల్ఐసీ.. ఆమోదం తెలిపిన ఆర్బీఐ!