Covid-19: ఒమిక్రాన్, థర్డ్ వేవ్ భయాలు.. బూస్టర్ డోస్‌కు సుముఖంగా కేంద్రం.. కండీషన్స్ అప్లై
కరోనా బూస్టర్ డోస్‌కు కేంద్రం పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. రెండో డోసు తీసుకున్న తొమ్మిది నెలల తర్వాత మూడో డోసు తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు పార్లమెంటరీ ప్యానెల్‌కు తెలిపారు.
కరోనా బూస్టర్ డోస్‌కు కేంద్రం పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. రెండో డోసు తీసుకున్న తొమ్మిది నెలల తర్వాత మూడో డోసు తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు పార్లమెంటరీ ప్యానెల్‌కు తెలిపారు. థర్డ్‌వేవ్, ఒమిక్రాన్ భయంతో ఇప్పటికే చాలా మంది ప్రముఖులు మూడో టీకా కోసం క్యూ కట్టారు.
ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో ఇప్పటికే బూస్టర్ డోస్ ఇస్తున్నారు.. మన దేశంలో మాత్రం ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ఒక నిర్ణయానికి రాలేకపోయింది. కరోనా కట్టడి కోసం ఇచ్చే రెండు డోసుల టీకాలు భారత్‌లో ఇప్పటికే చాలా మంది తీసుకున్నారు. దేశంలో థర్డ్‌వేవ్‌కు అవకాశం, ఒమిక్రాన్ భయాందోళనల నేపథ్యంలో బూస్టర్ డోస్ ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంది. దీనిపై కేంద్రం దృష్టి సారించింది.
బూస్టర్ డోస్ మీద చర్చించేందుకు ఆరోగ్య శాఖ సెక్రటరీ, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ తదితరులు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీతో ఇవాళ సమావేశమయ్యారు.. బూస్టర్ డోసుకు సంబంధించిన వివరాలను కమిటీకి వెల్లడించారు. అవసరం అనుకుంటే బూస్టర్ డోస్ తీసుకోవచ్చని.. రెండో డోసు తీసుకున్న తొమ్మిది నెలల తర్వాత మాత్రమే తీసుకోవాలని వారు కమిటీకి తెలిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశంలో 23 ఒమిక్రాన్ కేసుల వెలుగు చూసినందున, దీన్ని ఎదుర్కొందుకు అప్రమత్తంగానే ఉండాలని ఈ సమావేశంలో చర్చించారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అధికారులు వైరస్ కంటే ఒక అడుగు ముందే ఉండాలని ప్యానెల్ సభ్యులు ఈ సమావేశంలో సూచించారు.
దేశంలో ఒమిక్రాన్ ఆందోళనల నేపథ్యంలో చాలా మంది ప్రముఖులు బూస్టర్‌డోస్ మూడో టీకా కోసం క్యూకట్టారు.. అనుమతి రాగానే వేయించుకునేందుకు కొందరు సిద్దంగా ఉండగా, చాలా మంది అనధికారికంగా ప్రయివేటు ఆస్పత్రుల్లో మూడో డోస్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Also Read..
Tirupati: శ్రీవారికి అజ్ఞాత భక్తుడు భారీ విరాళం.. రూ. 3 కోట్లు విలువజేసే వరద-కఠి హస్తాల బహుకరణ