AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cabinet Meeting: కేంద్ర కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు.. సినిమాటోగ్రఫీ -2023 ముసాయిదా చట్టానికి కేబినెట్‌ ఆమోదం

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సినిమాటోగ్రఫీ -2023 ముసాయిదా చట్టానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పైరసీని నిరోధించడానికి ఈ చట్టం ఉపయోగపడుతుందని కేంద్రం తెలిపింది. నేషనల్ క్వాంటమ్‌ మిషన్‌కు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది..

Cabinet Meeting: కేంద్ర కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు.. సినిమాటోగ్రఫీ -2023 ముసాయిదా చట్టానికి కేబినెట్‌ ఆమోదం
Anurag Thakur
Subhash Goud
|

Updated on: Apr 19, 2023 | 9:30 PM

Share

ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సినిమాటోగ్రఫీ -2023 ముసాయిదా చట్టానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పైరసీని నిరోధించడానికి ఈ చట్టం ఉపయోగపడుతుందని కేంద్రం తెలిపింది. నేషనల్ క్వాంటమ్‌ మిషన్‌కు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

ఎలిఫెంట్‌ విస్పర్స్‌ , ట్రిపులార్‌ లాంటి సినిమాలకు అంతర్జాతీయంగా పేరు వచ్చిందని , ఇలాంటి సినిమాలను పైరసీ నుంచి కాపాడాల్సిన అవసరం ఉందన్నారు కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌. నేషనల్‌ క్వాంటమ్‌ మిషన్‌ కేవలం ఆరుదేశాల్లో మాత్రమే ఉందన్నారు . దీంతో డేటా మార్పిడి వేగంగా జరుగుతుందని తెలిపారు.

రానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో సినిమాటోగ్రఫీ చట్టాన్ని పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెడు తుంది. ఓటీటీ కంటెంట్‌ నియంత్రణపై కూడా ఈ బిల్లులో పలు ప్రతిపాదనలు ఉండే అవకాశం ఉంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అశ్లీలత పెరిగిపోయిందని , నియంత్రించాలని కేంద్రానికి పలు ఫిర్యాదులు అందాయి. దీంతో సినిమాటోగ్రఫీ చట్టంలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్త సినిమాలనపై పైరసీ చేసే వాళ్లకు కఠిన శిక్షలు విధించేలా ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి