Viral Video: పూరీ కావాలా నాయనా..! ప్లేటు నిండా పూరీలు.. కేవలం రూ.30/- లకే

Viral Video: పూరీ కావాలా నాయనా..! ప్లేటు నిండా పూరీలు.. కేవలం రూ.30/- లకే

Anil kumar poka

|

Updated on: Apr 19, 2023 | 8:27 PM

భారతీయులు స్ట్రీట్‌ ఫుడ్‌ను చాలా ఇష్టపడతారు. ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లేవాళ్లు, సాయం సమయంలో ఆఫీసులనుంచి ఇంటికి వెళ్తూ వెళ్తూ రోడ్డు పక్కన వేడివేడిగా టిఫిన్‌ లాగించి వెళ్లడం చేస్తుంటారు. సాధారణంగా హోటళ్లలో అయితే ఏదైనా ఓ ప్లేటు టిఫిన్‌ తినాలంటే 50 రూపాయలు పైనే ఉంటుంది.

భారతీయులు స్ట్రీట్‌ ఫుడ్‌ను చాలా ఇష్టపడతారు. ఉదయాన్నే ఆఫీసులకు వెళ్లేవాళ్లు, సాయం సమయంలో ఆఫీసులనుంచి ఇంటికి వెళ్తూ వెళ్తూ రోడ్డు పక్కన వేడివేడిగా టిఫిన్‌ లాగించి వెళ్లడం చేస్తుంటారు. సాధారణంగా హోటళ్లలో అయితే ఏదైనా ఓ ప్లేటు టిఫిన్‌ తినాలంటే 50 రూపాయలు పైనే ఉంటుంది. అదే స్ట్రీట్‌ స్టాల్‌లో అయితే 30 రూపాయలకే దొరుకుతుంది. ఒక ప్లేటు పూరీ అంటే రెండు పూరీలు, కర్రీ ఇస్తారు. కానీ రాజస్థాన్‌కు చెందిన ఓ జంట తక్కువ ధరకే అల్పాహారాన్ని అందిస్తూ కస్టమర్స్‌ నుంచి ప్రశంసలతో పాటు లాభాలు కూడా ఆర్జిస్తున్నారు. జైపూర్‌కు చెందిన ఓ జంట రోడ్‌సైడ్‌ స్ట్రీట్‌ ఫుడ్‌ స్టాల్‌ను నడుపుతూ.. ప్లేట్‌కు 10 పూరీలు అందిస్తోంది. అది కూడా కేవలం 30 రూపాయలకే. పూరీలకు కాంబినేషన్‌గా సబ్జీ, సైడ్‌ డిష్‌ కింద టమోటా, వెల్లుల్లి చట్నీని కూడా సర్వ్‌ చేస్తున్నారు. రైతా కావాలంటే మాత్రం మరో పది రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఉదయం ఏడున్నర గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ స్టాల్‌ అందుబాటులో ఉంటుంది. అప్పటికప్పుడు వేడివేడిగా టేస్టీ టేస్టీ పూరీలు ప్లేటునిండా పెట్టి ఇస్తుంటే.. ఎవరు మాత్రం ఎందుకు వదులుకుంటారు చెప్పండి. అందుకే ఆ దుకాణానికి జనాలు క్యూ కడుతున్నారు. వేడి వేడి పూరీలు ఆరగించి గుడ్‌ క్వాలిటీ, బెస్ట్‌ క్వాంటిటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..

Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్‌.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో..

Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..