Indian Railways: ట్రైన్ టికెట్లు కావాలా నాయనా..? IRCTC వెబ్‌సైట్‌నే హ్యాక్ చేసిన విద్యార్థి.. చివరకు..
Tatkal black tickets: 22ఏళ్లే.. బీటెక్ చదివుతున్నాడు.. పద్దతిగా జాబ్ కోసం ట్రై చేస్తున్నాడో.. లేదో జాబ్ చేసుకుంటున్నాడో అనుకునేరు.. అబ్బే అదేంలేదు.. ఉన్న తెలివితో దోచుకోవడమే పనిగా స్కెచ్ వేశాడు.. చివరకు IRCTC వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి భారతీయ రైల్వే ప్రయాణికులకు బ్లాక్‌లో తత్కాల్ టిక్కెట్లను విక్రయించడం మొదలుపెట్టాడు.
Tatkal black tickets: 22ఏళ్లే.. బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.. పద్దతిగా జాబ్ కోసం ట్రై చేస్తున్నాడో.. లేదో జాబ్ చేసుకుంటున్నాడో అనుకునేరు.. అబ్బే అదేంలేదు.. ఉన్న తెలివితో దోచుకోవడమే పనిగా ప్లాన్ చేశాడు.. చివరకు IRCTC వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి భారతీయ రైల్వే ప్రయాణికులకు బ్లాక్‌లో తత్కాల్ టిక్కెట్లను విక్రయించడం మొదలుపెట్టాడు. ఇలా రూ.15 లక్షలు సంపాదించాడు.. చివరకు పోలీసులు పట్టుకోవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. IRCTC వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి భారతీయ రైల్వే ప్రయాణికులకు బ్లాక్‌లో తత్కాల్ టిక్కెట్లను విక్రయించినందుకు 22 ఏళ్ల BTech విద్యార్థిని నోయిడాలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) శుక్రవారం అరెస్టు చేసింది. దీనిద్వారా యువకుడు దాదాపు రూ.15 లక్షలు సంపాదించాడని పోలీసులు తెలిపారు. నోయిడాలోని సెక్టార్ 73, సర్ఫాబాద్ కు చెందిన నయన్ ఆలం (22) గ్రేటర్ నోయిడాలోని ఒక ప్రైవేట్ కళాశాలలో చివరి సంవత్సరం బి-టెక్ కంప్యూటర్ సైన్స్ విద్యార్థి.. గత రెండేళ్లుగా అక్రమంగా టిక్కెట్లు విక్రయిస్తూ డబ్బులు దోచుకుంటున్నాడని పోలీసులు తెలిపారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రైల్వే టికెట్ల అక్రమ దందా గురించి జూలై 26 న ప్రయాగ్‌రాజ్ సైబర్ క్రైమ్ విభాగం RPF దాద్రీని హెచ్చరించింది. నోయిడాకు అనుసంధానంగా ఉన్న అనుమానాస్పద IP చిరునామా, మొబైల్ నంబర్‌ను ఉపయోగించి ఒకే రోజులో అనేక తత్కాల్ టిక్కెట్లు బుక్ అవుతున్నాయని పోలీసులకు తెలిపింది. సైబర్ వింగ్ నుంచి అందిన సమాచారం ఆధారంగా, తాము సాంకేతిక విశ్లేషణ సహాయంతో నిందితుడిని ట్రాక్ చేసి అరెస్టు చేసామని దాద్రి రైల్వే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎస్‌కె వర్మ తెలిపారు.
“ఆలమ్ టెంప్ మెయిల్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి 56 నకిలీ IRCTC IDలను సృష్టించి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ టెలిగ్రామ్‌లో ప్రైవేట్ గ్రూప్‌ను నిర్వహిస్తున్నాడని తెలిపారు. దీంతో దేశంలోని నలుమూలల నుంచి చాలామంది అత్యవసర పరిస్థితుల్లో తత్కాల్ టిక్కెట్‌లను కొనుగోలు చేయడానికి అతనిని సంప్రదించేవారు. ఈ క్రమంలో కోరుకున్న రూట్ రద్దీగా ఉంటే అసలు టిక్కెట్ ధర కంటే పది రెట్లు వసూలు చేసేవాడని అని ఎస్‌హెచ్‌ఓ వర్మ తెలిపారు.
ముఖ్యమైన తేదీలలో టికెట్లను బుక్ చేసిన ఆలం వాటిని అమ్ముకునేవాడని.. అలాంటివి 31 టికెట్లు ఉన్నాయని వాటి విలువ రూ.72,000 అని వర్మ తెలిపారు . రైల్వే టిక్కెట్లను బ్లాక్ మార్కెట్‌లో విక్రయించడం ద్వారా అతను గత రెండేళ్లలో దాదాపు రూ.15 లక్షల వరకు సంపాదించాడని అంచనా వేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆలం IRCTC వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసిన తర్వాత ఒకే క్లిక్‌లో ఆరు తత్కాల్ టిక్కెట్‌లను బుక్ చేసుకునేందుకు వీలు కల్పించిన అక్రమ సాఫ్ట్‌వేర్ “Nexus”ని ఉపయోగిస్తున్నాడని తెలిపారు.
నిందితుడి వద్ద రెండు మొబైల్ నంబర్లు, కంప్యూటర్, మొబైల్ ఫోన్ ఉన్నాయని, అన్నింటినీ స్వాధీనం చేసుకున్నామని ఎస్‌హెచ్‌ఓ వర్మ తెలిపారు. శుక్రవారం దాద్రీ పోలీస్ స్టేషన్‌లో ఆలమ్‌పై రైల్వే చట్టంలోని సెక్షన్ 143 (రైల్వే టిక్కెట్లను సేకరించడం) కింద కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..