20 ఏళ్ల తర్వాత తెలంగాణలో కొడుకు ఆచూకీ లభ్యం.. వెతుక్కుంటూ వచ్చిన యూపీ కుటుంబం

20 ఏళ్ల క్రితం ముంబైలో తప్పిపోయిన ఓ బాలుడు 30 ఏళ్ల యువకుడై తిరిగి రావడంతో ఆ కుటుంబ సభ్యుల్లో ఆనంద వెల్లివెరిసింది. ఉఫాది కోసం ఉన్న ఊరు వదిలి వలస వెళ్లిన ఓ కుటుంబంలోని కొడుకు మిస్ అవడం.. ఆ తర్వాత కుటుంబానికి‌ దూరమైన ఆ కొడుకు కూలీగా మారడం.. 20 ఏళ్ల తర్వాత తమ కొడుకు క్షేమంగా ఉన్నాడని తెలియడంతో కొడుకును‌ వెతుక్కుంటూ కుటుంబమంతా పరుగు పరుగున అక్కడి చేరుకోవడం సినిమా కథను తలపించింది.

20 ఏళ్ల తర్వాత తెలంగాణలో కొడుకు ఆచూకీ లభ్యం.. వెతుక్కుంటూ వచ్చిన యూపీ కుటుంబం
Family
Follow us
Naresh Gollana

| Edited By: Aravind B

Updated on: Jul 29, 2023 | 11:09 AM

మంచిర్యాల జిల్లా జులై 29: 20 ఏళ్ల క్రితం ముంబైలో తప్పిపోయిన ఓ బాలుడు 30 ఏళ్ల యువకుడై తిరిగి రావడంతో ఆ కుటుంబ సభ్యుల్లో ఆనంద వెల్లివెరిసింది. ఉఫాది కోసం ఉన్న ఊరు వదిలి వలస వెళ్లిన ఓ కుటుంబంలోని కొడుకు మిస్ అవడం.. ఆ తర్వాత కుటుంబానికి‌ దూరమైన ఆ కొడుకు కూలీగా మారడం.. 20 ఏళ్ల తర్వాత తమ కొడుకు క్షేమంగా ఉన్నాడని తెలియడంతో కొడుకును‌ వెతుక్కుంటూ కుటుంబమంతా పరుగు పరుగున అక్కడి చేరుకోవడం సినిమా కథను తలపించింది. తమ కొడుకు తెలంగాణలో‌ క్షేమంగా ఉన్నాడని తెలియడంతో ఆ కుటుంబం ఆనందంతో ఉప్పొంగిపోతోంది. 20 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు అయిన‌వారిని కలుసుకోవడంతో ఆ కొడుకు ఆనందం అంతా ఇంతా కాదు. వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ జిల్లా తాసిల్ మొహందాబాద్ రఘువర్ గంజ్ గ్రామానికి చెందిన మహేందర్ బింద్ అనే బాలుడు ఐదవ తరగతి చదువుతున్న సమయంలో మహారాష్ట్రలోని ముంబైకి కుటుంబంతో కలిసి చుట్టపు చూపుగా వెళ్లారు‌. పని కోసం తండ్రి బయటకు వెళ్లగా కొడుకును‌ తీసుకుని తల్లి మరో చోట పని వెతుక్కుంటూ వెళ్లింది. ఆ సమయంలో కొడుకు మిస్ అవడంతో తల్లి ఆందోళనకు గురైంది. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి‌ గాలించినా లాభం లేకుండా పోయింది. మహానగరంలో కొడుకు జాడ తెలియక ఉఫాది కానరాక తిరిగి స్వగ్రామానికి తిరిగి వెళ్లారు మహేందర్ బింద్ తల్లిదండ్రులు.

చివరికి మహేందర్ బిన్ ముంబాయిలోని ఓ బేకరీలో పనికి‌ కుదిరాడు. అక్కడే పని చేస్తూ జీవనం సాగించాడు. ఈ క్రమంలో బెల్లంపల్లిలో ఓ బేకరీలో పనిచేస్తున్న శివకుమార్ యాదవ్ ముంబైకి వెళ్లడంతో అక్కడ మహేందర్ బింద్ కలిశాడు. పని కోసం బెల్లంపల్లిలోని మనీషా బేకరీకి మహేందర్ తీసుకువచ్చాడు శివకుమార్. మహేందర్ బింద్ అనే యువకుడు తనది ఘాజీపూర్ జిల్లా అని చెప్పడంతో శివ కుమార్ కూడా తనది ఉత్తరప్రదేశ్ అని చెప్పడంతో తన కుటుంబ సభ్యులు దొరుకుతారేమోనని ఆశపడ్డాడు. ఇదే సమయంలో శివ కుమార్ యాదవ్ ఘాజీపూర్ పోలీసులకు మహేందర్ బింద్ కోసం సమాచారం అందించాడు. అడ్రస్ దొరకడంతో మహేందర్ బింద్ వివరాలను కుటుంబ సభ్యులకు చేరవేశారు పోలీసులు.

వెంటనే తల్లి సంత్ర బింద్, చిన్నమ్మ బసంత్ బింద్, బాబాయి కమలేష్ బింద్ తో కలిసి కుటుంబమంతా ఆనందంతో‌ ఘాజీపూర్ నుండి తెలంగాణలోని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లికి చేరింది. పుట్టుమచ్చల ఆధారంగా కొడుకును గుర్తు పట్టిన తల్లి సంత్ర బింద్ ఆనందంతో ఉప్పొంగి పోయింది. 30 ఏళ్ల కుమారుడిని చూసి ప్రేమతో హత్తుకొని మురిసిపోయింది ఆ కుటుంబం. శివ కుమార్ యాదవ్ సాయంతో తమ కొడుకు మళ్లీ తమకు దక్కడం తో అతనికి కృతజ్ఞతలు తెలిపారు మహేందర్ కుటుంబ సభ్యులు. ఎట్టకేలకు కుమారుని తీసుకొని బెల్లంపల్లి నుంచి రప్తి సాగర్ ఎక్స్ ప్రెస్ రైలు లో ఉత్తర్ ప్రదేశ్ కు బయలుదేరి వెళ్లింది కుటుంబం.

ఇవి కూడా చదవండి