Bandi Sanjay: జాతీయ నాయకత్వంలోకి బండి సంజయ్.. కీలక పదవి అప్పగించిన బీజేపీ అధిష్ఠానం
తెలంగాణలో అధికారం దక్కించుకోవడం బీజేపీ అనేక వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల రాష్ట్ర జాతీయ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తప్పించి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. బీజేపీ పార్టీకి తెలంగాణలో ఒక ఊపు తెచ్చిన బండి సంజయ్‌ను ఈ బాధ్యతల నుంచి తప్పించడంపై చాలా మంది కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు.
తెలంగాణలో అధికారం దక్కించుకోవడం బీజేపీ అనేక వ్యూహాలు రచిస్తోంది. ఇటీవల రాష్ట్ర జాతీయ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తప్పించి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. బీజేపీ పార్టీకి తెలంగాణలో ఒక ఊపు తెచ్చిన బండి సంజయ్‌ను ఈ బాధ్యతల నుంచి తప్పించడంపై చాలా మంది కార్యకర్తలు అసహనం వ్యక్తం చేశారు. అయితే బండి సంజయ్‌కు మరో పదవి ఇస్తారని ఇటీవల జోరుగా ప్రచారాలు జరిగాయి. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. బీజీపీ జాతీయ నాయకత్వంలోకి బండి సంజయ్‌ను ఆహ్వానించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయనకి బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. కమల అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంపై బండి సంజయ్ అనుచరులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలిగా తెలంగాణ నుంచి డీకే అరుణ కొనసాగనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ జాతీయ కార్యదర్శిగా సత్య కమార్ కొనసాగనున్నట్లు అధిష్ఠానం ప్రకటించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ ఇప్పటికే ఢిల్లీకి బయలుదేరారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఎమ్మెల్యే ఈటల రాజేంధర్ ఢిల్లీకి వెళ్లనున్నారు.
भाजपा राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda ने निम्नलिखित केंद्रीय पदाधिकारियों के नामों की घोषणा की है- pic.twitter.com/0aaArxHF30
— BJP (@BJP4India) July 29, 2023