అవేం విమానాలు ? భారత పౌరవిమానయాన సంస్థపై యుఎస్ అధికారుల దూషణలు

ఇది సుమారు మూడేళ్ళ క్రితం నాటి మాట.. ఇండియాలో బోయింగ్ శ్రేణిలోని 737 మాక్స్ విమానాల నమూనాలను ఆమోదించే ప్రక్రియలో అమెరికాలోని బోయింగ్ సంస్థకు చెందిన ఎగ్జిక్యూటివ్ లు.. భారత పౌర విమానయాన సంస్థ (డీజీసీఏ) ను నోటికొచ్చినట్టు తిట్లు తిట్టారట.. ‘ ఫూల్స్’, ‘ స్టుపిడ్స్ ‘ అంటూ శాపనార్థాలు పెట్టినట్టు కొన్ని డాక్యుమెంట్ల ద్వారా వెల్లడైంది.  వీటిని బోయింగ్ సంస్థ రిలీజ్ చేసింది. గత ఏడాది ఆరంభంలో ప్రపంచ వ్యాప్తంగా  వైమానిక డీజీసీఏలు 737 […]

అవేం విమానాలు ? భారత పౌరవిమానయాన సంస్థపై యుఎస్ అధికారుల దూషణలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 11, 2020 | 5:50 PM

ఇది సుమారు మూడేళ్ళ క్రితం నాటి మాట.. ఇండియాలో బోయింగ్ శ్రేణిలోని 737 మాక్స్ విమానాల నమూనాలను ఆమోదించే ప్రక్రియలో అమెరికాలోని బోయింగ్ సంస్థకు చెందిన ఎగ్జిక్యూటివ్ లు.. భారత పౌర విమానయాన సంస్థ (డీజీసీఏ) ను నోటికొచ్చినట్టు తిట్లు తిట్టారట.. ‘ ఫూల్స్’, ‘ స్టుపిడ్స్ ‘ అంటూ శాపనార్థాలు పెట్టినట్టు కొన్ని డాక్యుమెంట్ల ద్వారా వెల్లడైంది.  వీటిని బోయింగ్ సంస్థ రిలీజ్ చేసింది. గత ఏడాది ఆరంభంలో ప్రపంచ వ్యాప్తంగా  వైమానిక డీజీసీఏలు 737 విమానాలను నిషేధించాయి. ఇవి కూలిపోయిన రెండు దుర్ఘటనల్లో 346 మంది మృతి చెందడమే ఇందుకు కారణం.

ఈ కారణం వల్లే వీటిని ఇక విమానాశ్రయాలకే పరిమితం చేయాలని డీజీసీఏ గత ఏడాది మార్చిలో నిర్ణయించింది. ఇంటర్నల్ బోయింగ్ డాక్యుమెంట్ల తాజా ప్రతులను యుఎస్ ఏవియేషన్ రెగ్యులేటర్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, యుఎస్ కాంగ్రెస్ లకు అందజేశారు. ఇవి గురువారం విడుదలయ్యాయి. ఈ డాక్యుమెంట్ల ప్రకారం.. ఇండియాలోని డీజీసీఏ మూర్ఖంగా ప్రవర్తించిందని, స్టుపిడ్ అని ఓ ఎగ్జిక్యూటివ్ వ్యాఖ్యానించాడట. మరొకడు ‘ ఫూల్స్ ‘ అని తన నోటిదురుసుతనాన్ని ప్రదర్శించాడు. అయితే ఈ ‘ తిట్లను ‘ భారత ఏవియేషన్ అధికారులు తేలిగ్గా తీసుకున్నారు. వారి అభిప్రాయాలను గౌరవిస్తామని, మా సర్వీసులను మరింత మెరుగుపరుచుకునేందుకు యత్నిస్తామని వారు పేర్కొన్నారు.

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు