సస్పెన్స్ కి తెర …..మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం… బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్
మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. శివసేనతో తమ పార్టీ పొత్తు పెట్టుకోవచ్చునని వచ్చిన వార్తలను ఊహాజనితాలుగా ఆయన కొట్టి పారేశారు. మహా వికాస్ అఘాడీలో భాగస్వామ్యం
మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. శివసేనతో తమ పార్టీ పొత్తు పెట్టుకోవచ్చునని వచ్చిన వార్తలను ఊహాజనితాలుగా ఆయన కొట్టి పారేశారు. మహా వికాస్ అఘాడీలో భాగస్వామ్యం కలిగిన పార్టీలు ఎవరితో పొత్తు పెట్టుకోవాలో..ఎవరిపై చెప్పు విసరాలో… ఎవరికీ పూలమాల వేయాలో అవే నిర్ణయించుకోవాలన్నారు. ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తామంటూ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా తప్పు పట్టిన సీఎం ఉద్ధవ్ థాక్రే.. ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేసే పార్టీలను ప్రజలు చెప్పుతో కొడతారని చేసిన ప్రకటనను ఫడ్నవీస్ గుర్తు చేశారు. ప్రజలతోనే తాము ఉంటామని, వారి సంక్షేమమే తమకు ముఖ్యమని ఆయన అన్నారు. శివసేనతో చేతులు కలుపుతామని వచ్చిన వార్తలు నిజం కావన్నారు. అటు శివసేన నేత సంజయ్ రౌత్ కూడా అవసరమైతే తాము కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగుతామని నిన్న ప్రకటించారు. తమకు ఇలాంటి పోరాటాలు కొత్త కాదన్నారు.
ఇలా ఉండగా రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోల్ మెత్తబడినట్టు కనిపిస్తోంది. రాష్ట్రంలో ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం పూర్తి కాలం అధికారంలో కొనసాగేలా ఈ ప్రభుత్వానికి తాము మద్దతునిస్తామని తాజాగా స్పష్టం చేశారు. మా పార్టీ నుంచి ఈ సర్కార్ కు ఎలాంటి సమస్య ఉండదన్నారు. అంతకు ముందు ఆయన రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని, పార్టీ హైకమాండ్ ఆదేశిస్తే తానే సీఎం అభ్యర్థినని వ్యాఖ్యానించారు. దీనిపైననే సీఎం ఉద్ధవ్ మండిపడిన సంగతి తెలిసిందే.
మరిన్ని ఇక్కడ చూడండి: మూడంతస్తులు ఎక్కొచ్చి బెడ్ పై సీదతీరుతున్న ఎద్దు వైరల్ అవుతున్న వీడియో :Bull king climbed into 3-storey house video viral.
నలుగురూ కలిశారు ఓ గట్టి పట్టు పట్టారు…విందు కార్యక్రమంలో వధువు అల్లరి.. అందరూ ఫిదా: viral video.