నాడు మా పార్టీని బీజేపీ బానిసలుగా చూసింది…..నిప్పులు కక్కిన శివసేన నేత సంజయ్ రౌత్

మహారాష్ట్రలో 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న బీజేపీ తమ పార్టీని బానిసలుగా చూసిందని, రాజకీయంగా అణగదొక్కాలని అన్ని ప్రయత్నాలు చేసిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు.

  • Publish Date - 7:15 pm, Sun, 13 June 21 Edited By: Phani CH
నాడు మా పార్టీని బీజేపీ బానిసలుగా  చూసింది.....నిప్పులు కక్కిన శివసేన నేత సంజయ్ రౌత్
Sanjay Raut

మహారాష్ట్రలో 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న బీజేపీ తమ పార్టీని బానిసలుగా చూసిందని, రాజకీయంగా అణగదొక్కాలని అన్ని ప్రయత్నాలు చేసిందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. ఆ నాటి ప్రభుత్వంలో సేన రెండో స్థానంలో ఉంటూ వచ్చిందని, అయినా కమలం పార్టీ తమను ఇలా బానిసలుగా చూసిందని ఆయన చెప్పారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని మమ్మల్ని పొలిటికల్ గా అణచివేయాలని కూడా చూసింది అని పేర్కొన్నారు. జలగావ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన… రాష్ట్రంలో తమ పార్టీ నేతే సీఎంగా ఉండాలని తాము భావిస్తూ వచ్చామని, శివసైనికులకు ఏదీ లభించకపోయినా రాష్ట్ర నాయకత్వం ఇప్పుడు శివసేన చేతుల్లోనే ఉందని గర్వంగా చెప్పుకోగలుగుతున్నామన్నారు. ఈ సెంటిమెంట్ తోనే మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పడింది అన్నారు. రాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ఇటీవల ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయిన నేపథ్యంలో.. సంజయ్ రౌత్ ఇలా వ్యాఖ్యానించడం విశేషం. కాగా..ఈయన నిన్న గాక మొన్న ప్రధాని మోదీని, బీజేపీని ఆకాశానికెత్తిన విషయం గమనార్హం. మోదీ ఈ దేశానికి, బీజేపీకి టాప్ లీడర్ అని, ఆయన నాయకత్వానికి బీజేపీ రుణపడి ఉండాలని వ్యాఖ్యానించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.

తాజాగా మళ్ళీ బీజేపీపై నిప్పులు కక్కుతున్నారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఎన్సీపీ నేత శరద్ పవార్ .. ఈ మధ్యే బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో ఎందుకు భేటీ అయ్యారో మరి ! అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలాంటి అంశాలపై మీడియా సూటిగా ప్రశ్నించాల్సి ఉంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Allu Arjun: బాలీవుడ్ పై కన్నేస్తున్న అల్లు అర్జున్.. హిందీ ఆడియన్స్ కోసం భారీ ప్లాన్.. ( వీడియో )

NASAN: మరో కొత్త గ్రహం గుర్తించిన నాసా.. దాని పేరేంటి? అక్కడ వాతావరణం ఎలా ఉంది? ( వీడియో )