LK Advani: అలా ఎందుకు చేశారో ఎల్కే అద్వానీని అడగండి.. BJP నేతలకు SP నేత కౌంటర్

పాక్ జాతిపిత జిన్నాను కొనియాడుతూ అఖిలేష్ యాదవ్ గత వారం వ్యాఖ్యలు చేయడాన్ని సమాజ్‌వాది పార్టీ మరోసారి సమర్థించుకుంది. ఈ విషయంలో బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను

LK Advani: అలా ఎందుకు చేశారో ఎల్కే అద్వానీని అడగండి.. BJP నేతలకు SP నేత కౌంటర్
Lal Krishna Advani
Follow us
Janardhan Veluru

| Edited By: Anil kumar poka

Updated on: Dec 23, 2021 | 6:24 PM

దేశ స్వాతంత్ర పోరాటంలో పాక్ జాతిపిత జిన్నా పాత్రను కొనియాడుతూ యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ గత వారం వ్యాఖ్యలు చేయడాన్ని సమాజ్‌వాది పార్టీ మరోసారి సమర్థించుకుంది. ఈ విషయంలో బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలను సమాజ్‌వాది పార్టీ సీనియర్ నేత నారద్ రాయ్ తిప్పికొట్టారు. జిన్నాను కొనియాడినందుకు అఖిలేష్ యాదవ్‌పై బీజేపీ నేతలు విమర్శలు చేయడం అర్థరమితమన్నారు. అఖిలేష్ వ్యాఖ్యలకు అభ్యంతరం చెబుతున్న బీజేపీ నేతలు.. ముందుగా ఎల్కే అద్వానీ పాకిస్థాన్‌కు వెళ్లి జిన్నా సమాధి దగ్గర చాదర్ ఎందుకు సమర్పించారో ఆయన్ను ప్రశ్నించాలని సూచించారు.

దేశ స్వాతంత్ర పోరాటంలో ముహమ్మద్ అలీ జిన్నా పాత్రను స్మరించుకునేందుకే ఎల్కే అద్వానీ జిన్నా సమాధిని సందర్శించి, అక్కడ చాదర్‌ను సమర్పించి నివాళులర్పించారని అన్నారు. అద్వానీలానే అఖిలేష్ యాదవ్ కూడా దేశ స్వాతంత్ర పోరాటంలో జిన్నా పాత్రను కొనియాడారని అన్నారు.

2005లో ఎల్కే అద్వానీ పాకిస్థాన్‌లో పర్యటించి ఆ దేశ జాతిపిత జిన్నాను ప్రశంసించడంపై అప్పట్లో అద్వానీని సొంత పార్టీ నేతలు, సంఘ్ పరివార్ నేతలు విమర్శించడం తెలిసిందే.  మహాత్మాగాంధీ, నెహ్రూ, సర్ధార్ వల్లభాయ్ పటేల్, జిన్నా పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్రం వచ్చిందంటూ అక్టోబర్ 31న అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలు చేశారు. జిన్నాను సర్ధార్ వల్లభాయ్ పటేల్‌తో పోల్చడం సరికాదంటూ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ముస్లీం ఓట్ల కోసమే అఖిలేష్ జిన్నా జపం చేస్తున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు అక్కడ రాజకీయ దుమారంరేపుతున్నాయి.

Also Read..

Paytm Vijay shekhar: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పేటీఎం సీఈఓ విజయ్‌.. పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లిన నేపథ్యంలో..

Bigg Boss 5 Telugu: ప్రియాంక గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మానస్ తల్లి..పెళ్లి చేస్తా అంటూ..

Lakhimpur Kheri case: లఖీంపూర్‌ ఖేరి ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్.. యూపీ సర్కార్‌పై కీలక వ్యాఖ్యలు!