Covid-19 vaccine: బీజేపీ నేతకు ఐదు డోసుల కరోనా వ్యాక్సిన్.. ఆరో టీకాకు షెడ్యూల్.. అసలు ఏం జరిగిందంటే..?
BJP leader given 5 doses of Corona vaccine: ఓ బీజేపీ నాయకుడికి ఐదు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు. తాజాగా ఆరో డోసు కూడా ఇచ్చేందుకు షెడ్యూల్ చేసినట్లు సర్టిఫికెట్ ద్వారా తెలిసింది. ఇదంతా ప్రభుత్వం
BJP leader given 5 doses of Corona vaccine: ఓ బీజేపీ నాయకుడికి ఐదు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు. తాజాగా ఆరో డోసు కూడా ఇచ్చేందుకు షెడ్యూల్ చేసినట్లు సర్టిఫికెట్ ద్వారా తెలిసింది. ఇదంతా ప్రభుత్వం మంజూరు చేసిన సర్టిఫికెట్‌లో వెల్లడి కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం సృష్టించింది. కానీ ఇది నిజం కాదని తెలిసి అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఏం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌లోని భారతీయ జనతా పార్టీకి ఓ నాయకుడికి ఇప్పటికే ఐదు డోసుల కొవిడ్ -19 వ్యాక్సిన్ ఇచ్చారని, ఆరవ డోస్ షెడ్యూల్ చేసినట్లు అతని టీకా సర్టిఫికెట్‌లో వెల్లడైంది. మీరట్ నగరంలోని సర్ధనా ప్రాంతం బూత్ నంబరు 79 బీజేపీ అధ్యక్షుడైన రాంపాల్ సింగ్ (73) తన టీకా సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వాస్తవానికి రాంపాల్ సింగ్‌కు రెండు డోసుల టీకాను మాత్రమే ఇచ్చారు. కానీ అతని టీకా సర్టిఫికెట్ డౌన్ లోడ్ చేసుకుంటే ఐదు డోసుల టీకా తీసుకున్నట్లు, మరో టీకా కోసం తాజాగా షెడ్యూల్ చేసినట్లు ఉంది. దీంతో రాంపాల్ సింగ్ ఆరోగ్యశాఖ అధికారులను ఆశ్రయించి ఇదేంటని ప్రశ్నించాడు.
వాస్తవానికి రాంపాల్ సింగ్ మొదటి డోస్ టీకాను ఈ ఏడాది మార్చి 16వ తేదీన, రెండవ డోస్ మే 8వ తేదీన తీసుకున్నాడు. కానీ సింగ్ తన అధికారిక సర్టిఫికెట్‌ను పోర్టల్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోలేదు. తీరా ఇటీవల డౌన్‌లోడ్ చేసుకుంటే.. ఇప్పటికే ఐదుడోసుల వ్యాక్సిన్ పొందానని, డిసెంబర్ 2021, జనవరి 2022ల మధ్య ఆరో డోస్ టీకా కోసం షెడ్యూల్ చేసినట్లు సర్టిఫికెట్లో చూపిస్తుందని రాంపాల్ సింగ్ తెలిపాడు.
సర్టిఫికెట్ ప్రకారం.. మార్చి 16న మొదటి డోస్, మే 8న రెండో డోస్, మే 15న మూడు, సెప్టెంబరు 15వ తేదీన నాలుగు ఐదు డోసుల టీకాలు తీసుకున్నట్లు సర్టిఫికెట్‌లో చూపిస్తుందని బాదితుడు పేర్కొన్నాడు. వాస్తవానికి ఎక్కువ సార్లు టీకా తీసుకున్నట్లు నమోదవడం ఇదే మొట్టమొదటిసారని అధికారులు తెలిపారు. ఎక్కడో పొరపాటు జరిగి ఉండవచ్చని మీరట్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ అఖిలేష్ మోహన్ పేర్కొన్నారు.
Also Read: