Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Makkal Iyakkam: తమిళనాడు పంచాయతీ ఎన్నికల బరిలో హీరో విజయ్ పార్టీ.. రెండో రోజుల్లో అభ్యర్థుల ప్రకటన

Vijay Makkal Iyakkam: తమిళనాడు లో ఇప్పటికే సినీ తారలు రాజకీయాల్లో అడుగు పెట్టి సక్సెస్ సాధించారు. నటనలోనే కాదు రాజకీయాల్లో కూడా తమదైన ముద్ర వేశారు. ఎంజీఆర్ , జయలలిత , స్టాలిన్ వంటి..

Vijay Makkal Iyakkam: తమిళనాడు పంచాయతీ ఎన్నికల బరిలో హీరో విజయ్ పార్టీ.. రెండో రోజుల్లో అభ్యర్థుల ప్రకటన
Vijay
Follow us
Surya Kala

|

Updated on: Sep 20, 2021 | 12:46 PM

Vijay Makkal Iyakkam: తమిళనాడు లో ఇప్పటికే సినీ తారలు రాజకీయాల్లో అడుగు పెట్టి సక్సెస్ సాధించారు. నటనలోనే కాదు రాజకీయాల్లో కూడా తమదైన ముద్ర వేశారు. ఎంజీఆర్ , జయలలిత , స్టాలిన్ వంటి వారు తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పారు. సీఎంగా తమదైన పరిపాలన అందించారు. ఇక విజయ్ కాంత్ , రజనీకాంత్ , కమల్ హాసన్ లు కూడా రాజకీయ పార్టీలు పెట్టారు. అయితే రజనీకాంత్ రాజకీయాలను ప్రాధమిక దశలోనే విరమించుకుంటే.. విజయ్ కాంత్, కమల్ హాసన్ లు ఎన్నికల్లో పోటీ చేశారు.

ఇక తాజాగా ప్రముఖ సినీ నటుడు విజయ్ కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు అభిమానులు బ్యానెర్లు పెట్టారు. మక్కళ్ ఇయక్కం పార్టీ తో విజయ్ ఎన్నికల్లో పోటీ చేయనున్నాడని . మధురై లో అభిమానుల బ్యానెర్లు ఏర్పాటు చేశారు. వచ్చే నెల అక్టోబర్ 06 , 09 , తేదీలలో తమిళనాడు లో తొమ్మిది జిల్లాలో పంచాయితీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పంచాయితీ ఎన్నికల్లో విజయ్ మక్కళ్ ఇయక్కం పార్టీ పోటీ చేయాలని జిల్లా అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సినీ నటుడు విజయ్ తో జిల్లా అధ్యుక్షులు చర్యలు జరిపారు. గ్రామాలలో విజయ్ మక్కళ్ ఇయక్కం తరపున అభ్యర్థులను నిలబెట్టడానికి విజయ్ ఆసక్తి చూపించినట్లు టాక్ వినిపిస్తోంది. అంతేకాదు మరో రెండు రోజుల్లో విజయ్ మక్కళ్ ఇయక్కం తమ అభ్యర్థులను ప్రకటించనుంది.

అయితే మరోవైపు హీరో విజయ్ తన అనుమతిలేకుండా తల్లి దండ్రులు తన పేరు వాడుకుంటున్నారు అంటూ కేసు పెట్టి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. డాది క్రితం తండ్రి పెట్టిన విజయ్‌ మక్కల్‌ ఇయ్యకమ్‌ పార్టీతో తనకు సంబంధం లేదని హీరో విజయ్‌ గతంలో ప్రకటించారు

Also Read: టాలీవుడ్‌లో ఏఎన్నార్ 75ఏళ్ల జర్నీ.. ఆయనో బహుదూరపు బాటసారి. ఆ మహానటుడు జయంతి సందర్భంగా రేర్ ఫొటోస్ మీకోసం