Sonu Sood: ఐటీ దాడులు, పన్ను ఎగవేత ఆరోపణలపై స్పందించిన నటుడు సోను సూద్

ఎట్టకేలకు సోను సూద్ రెస్పాండ్ అయ్యారు.  గత వారం తన ఇళ్లు,  కార్యాలయాలలో ఐటీ శాఖ దాడులు, అనంతరం పన్ను ఎగవేత ఆరోపణలపై స్పందించారు.

Sonu Sood: ఐటీ దాడులు, పన్ను ఎగవేత ఆరోపణలపై స్పందించిన నటుడు సోను సూద్
Sonu Sood

నటుడు సోను సూద్ మౌనం వీడారు.  గత వారం తన ఇళ్లు,  కార్యాలయాలలో ఐటీ శాఖ దాడులు, అనంతరం రూ.20 కోట్ల మేర పన్ను ఎగవేత ఆరోపణలపై స్పందించారు. తన ఫౌండేషన్‌లోని ప్రతి రూపాయి ఒక ప్రాణాన్ని కాపాడేందుకు ఎదురుచూస్తోందని చెప్పారు. ‘మీరు ఎల్లప్పుడూ మీ వైపు వెర్షన్ చెప్పనవసరం లేదు. అది ప్రజలకు తెలిసే సమయం వస్తుంది’ అని ట్విట్ చేశారు. చిత్తశుద్ధి ఉంటే చాలా కష్టమైన మార్గం కూడా తేలికగా ఉంటుందని పేర్కొన్నారు.

‘మీ ప్రేమ వ‌ల‌న అధ్వాన్నంగా ఉన్న‌ రోడ్లపై ప్ర‌యాణం కూడా ఈజీ అవుతుంది. మ‌న నిజాయితీ గురించి స్పెషల్‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కాలం వెల్ల‌డిస్తుంది. దేశంలోని ప్రజలకు సేవ చేయడానికి కట్టుబడి ఉన్నాను. అదే నాకు బలాన్నిస్తుంది. నా ప్రయాణం ఇలాగే కొనసాగుతుంటుంది. మాన‌వ‌తా కార‌ణాల‌తో కొన్ని బ్రాండ్ల‌ను సైతం ప్రోత్సహించాను. నేను మద్దతు పలుకుతున్న బ్రాండ్‌ల నుంచి వస్తున్న ఆదాయాన్ని అవసరాల్లో ఉన్న అర్హులకు అందిస్తుంటాను. ఇది నిర్విరామంగా కొనసాగుతుంటుంది. నాలుగు రోజులుగా నేను నా గెస్టులు( ఐటీ అధికారులు)తో బిజీగా ఉన్నాను. ఆ కార‌ణం వ‌ల్ల‌నే మీ సేవ‌లో ఉండ‌లేక‌పోయాను. ఇప్పుడు తిరిగి వ‌చ్చాను’ అని ట్వీట్‌లో రాసుకొచ్చారు సోను సూద్.

ఇటీవల సోనూసూద్‌.. ఢిల్లీ ‘ఆప్‌’ గవర్నమెంట్ ప్రారంభించిన ఓ కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను సైతం కలిశారు. ఈ నేపథ్యంలో తాజా ఐటీ సోదాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: Malli Modaliandi: సిద్ శ్రీరామ్ నోట ‘అలోన్‌ అలోన్’ అంటూ మరో మెలోడీ పాట..

Click on your DTH Provider to Add TV9 Telugu