Malli Modaliandi: సిద్ శ్రీరామ్ నోట ‘అలోన్‌ అలోన్’ అంటూ మరో మెలోడీ పాట.. కనులకు తెలియని ఓ కలలా సాంగ్‌కు టాలీవుడ్ సెలబ్రెటీలు ఫిదా..

Surya Kala

Surya Kala |

Updated on: Sep 20, 2021 | 11:30 AM

Malli Modaliandi: సిద్ శ్రీరామ్ గళం నుంచి వచ్చిన మరో మెలోడీ తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు, పాటల ప్రియులను కూడా ఆకట్టుకుంటుంది. తాజాగా సుమంత్ అక్కినేని హీరోగా నటిస్తున్న మళ్ళీ మొదలైంది సినిమా..

Malli Modaliandi: సిద్ శ్రీరామ్ నోట 'అలోన్‌ అలోన్' అంటూ మరో మెలోడీ పాట.. కనులకు తెలియని ఓ కలలా సాంగ్‌కు టాలీవుడ్ సెలబ్రెటీలు ఫిదా..
Malli Modalaindi

Follow us on

Malli Modaliandi: సిద్ శ్రీరామ్ గళం నుంచి వచ్చిన మరో మెలోడీ తెలుగు సినీ ప్రేక్షకులతో పాటు, పాటల ప్రియులను కూడా ఆకట్టుకుంటుంది. తాజాగా సుమంత్ అక్కినేని హీరోగా నటిస్తున్న మళ్ళీ మొదలైంది సినిమా నుంచి “అలోన్ అలోన్” అనే లిరికల్ సాంగ్ వీడియో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.. విడుదలైన కొన్ని గంటల్లోనే రికార్డ్ స్థాయిలోనే వ్యూస్ ని దక్కించుకుంది. అంతేకాదు టాలీవుడ్ నటీనటులు కూడా ఈ సాంగ్ కు ఫిదా అయ్యారు. నాగార్జున అక్కినేని, మహేష్ బాబు, దుల్కర్ సల్మాన్, రామ్ గోపాల్ వర్మ, నిధి అగర్వాల్ , నిఖిల్ సిద్దార్ధ్ లు పాట ను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. ప్రశంసల వర్షం కురిపించారు. అద్భుతమైన మెలోడీ సాంగ్ మదిని తాకుతుంది.. మళ్లీ మళ్ళీ వినాలనిపిస్తుంది అంటూ.. చిత్రం విజయం సాధించాలని అంటూ చిత్ర యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

అవును సిద్ శ్రీరామ్ ప్రస్తుతం చలన చిత్ర పరిశ్రమలో సంచలన గాయకుడు. అమృతం గొంతులో పోస్తే ఎంత మధురంగా ఉంటుందో తెలియదు కానీ.. శ్రీరామ్ పాట వింటే మాత్రం అలాగే ఉంటుంది. పాట వింటున్నంత సేపూ బ్రహ్మదేవుడు సిద్ శ్రీరామ్ గొంతులో అమృతం కానీ పోసాడేమో అనిపించకమానదు. సిధ్ శ్రీరామ్ మూడేళ్ళ నుంచి పడుతున్న ప్రతి పాటా సంచలనమే.. అద్భుతమే.. ఇప్పుడు మల్లి మొదలైంది మూవీలో పాడిన పాట కూడా అంతే.. “కనులకు తెలియని ఓ కలలా .. వెలిపోయవే నువ్వు ఎలా.. మిగిలానే నేను ఓ శిలలా.. అలోన్ ” అంటూ సాగిన పాటను సిద్ శ్రీరామ్ పాడాడు. అనూప్ రూబెన్స్ స్వరాలు అందించాడు. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో చక్కటి ఫ్యామిలీ బాండింగ్ కూడా ఉందని ఈ లిరికల్ వీడియో చూస్తే అర్థమౌతోంది.

సుమంత్ ఈ సినిమాతో మళ్ళీ సక్సెస్ పట్టాలెక్కుతాడు అని పించేలా సాంగ్స్ ఉన్నాయి. డైవర్స్, రీ మ్యారేజ్ అనే అంశంపై తెలుగులో వస్తున్న మొదటి సినిమా తమదేనని సుంమంత్ చెప్పారు. కీర్తి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోహీరోయిన్లు సుమంత్, నైనా గంగూలీ నటిస్తున్నారు. ముఖ్య పాత్రల్లో సుహాసిని, ఘట్టమనేని మంజుల, అన్నపూర్ణమ్మ, పోసాని , వెన్నెల’ కిషోర్ తదితరులు నటిస్తున్నారు. కె. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. ‘మళ్ళీ రావా’ తర్వాత మరోసారి ‘మళ్ళీ మొదలైంది’తో సుమంత్ హిట్ కొట్టేట్టే కనిపిస్తున్నాడు. సుమంత్ మళ్ళీ పెళ్ళి చేసుకుంటున్నాడొహో! అంటూ సోషల్ మీడియా కోడై కూసింది ఈ సినిమా ప్రమోషన్స్ లో ఒక భాగమే అన్న విషయం సినీ ప్రేమికులు ఇంకా మరచిపోలేదు.

మహేష్ బాబు: 

అక్కినేని నాగార్జున :

రామ్ గోపాల్ వర్మ: 

దుల్కర్ సల్మాన్: 

నిఖిల్ సిద్దార్ద్:

నిధి అగర్వాల్ :

Also Read: Afghan Crisis: ఆఫ్ఘన్ తాలిబన్ల చేతికి వచ్చి నెలరోజులు.. రోజురోజుకీ పెరుగుతున్న ఆకలికేకలు.. కిలో ఆలూ కూడా మూడు వేలు

నేడు ఏపీ ప్రభుత్వంతో భేటీ కానున్న సినీ పెద్దలు.. సినీ పరిశ్రమలోని పలు విషయాలపై చర్చించే అవకాశం

స్టన్నింగ్ ఫోజుల్లో మిల్క్ బ్యూటీ.. చెక్కిన శిల్పంలా తమన్నా..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu