Afghan Crisis: ఆఫ్ఘన్ తాలిబన్ల చేతికి వచ్చి నెలరోజులు.. రోజురోజుకీ పెరుగుతున్న ఆకలికేకలు.. కిలో ఆలూ కూడా మూడు వేలు
Afghanistan Crisis: ఆఫ్గనిస్తాన్ ప్రజాస్వామ్య పరిపాలన నుంచి తాలిబన్ల పరిపాలన చేతికి వచ్చి నెలరోజులయ్యింది. తాలిబన్ల నీడలోకి చేరుకున్న అఫ్గనిస్థాన్‌లో ఈ నెలరోజుల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి..
Afghanistan Crisis: ఆఫ్గనిస్తాన్ ప్రజాస్వామ్య పరిపాలన నుంచి తాలిబన్ల పరిపాలన చేతికి వచ్చి నెలరోజులయ్యింది. తాలిబన్ల నీడలోకి చేరుకున్న అఫ్గనిస్థాన్‌లో ఈ నెలరోజుల్లో పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే పేరు మార్చుకున్న ఆఫ్గనిస్తాన్ తాజాగా పరిపాలనా విధానాన్ని కూడా మార్చుకుంది. ఆఫ్గనిస్తాన్ ను ఓ కౌన్సిల్ ద్వారా పరిపాలించనున్నారు. ఇక అక్కడ ఉన్న పరిస్థితులకు తాలిబన్లు చెబుతున్నదానికి చాలా తేడా ఉన్నట్లు స్పష్టం అవుతుంది. ప్రసుత్తం ఎక్కడ చూసినా ఎవరి నోట విన్నా అక్కడ జరుగుతున్న మారణకాండ గురించే.. అయితే తాలిబన్లు ప్రపంచానికి చెబుతుంది వేరు.. స్థానికంగా వారు ప్రవర్తిస్తున్న తీరు వేరు అని పలు సంఘటనల ద్వారా తెలుస్తోంది. తాలిబన్లు చేస్తున్న అకృత్యాలకు ఆడ, మగ, చిన్న, పెద్ద అనే తేడా లేదు.. అందరూ బాధితులుగా మారిపోయారు.
ప్రభుత్వాన్ని నడపడానికి రంగంలోకి దిగిన తాలిబన్లు ప్రజలకు కనీస సౌకర్యాలను కూడా కల్పించలేని స్థితిలో ఉన్నారు. ఇక పరిషియా చట్టం పేరుతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే స్థానికంగా తాలిబాన్లపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. అయితే తాలిబన్లు చేసే అకృత్యాలకు జడిసి.. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం వెళ్లదీస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో? ఎవరినీ తాలిబన్లు కిడ్నాప్ చేస్తారో? ఎవరిపై కాల్పులు జరుపుతారో తెలియక బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.
ఆఫ్గనిస్తాన్ లోని పరిస్థితులు నెల రోజుల నుంచి క్రమంగా దిగజారుతున్నాయి. ప్రజలు ఆర్థికంగా అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. కనీసం మూడు పూటలా తిండి లేని స్టేజ్ లో ఉన్నారు. ఆర్ధిక కష్టాలను తట్టుకోలేక.. కనీసం తినడానికి అయినా డబ్బులు వస్తాయని.. ఇంట్లోని ఖరీదైన వస్తువులను రోడ్లమీద పెట్టి తక్కువ ధరకు అమ్మకానికి పెట్టారు. కాబుల్ లో ఎక్కడ చూసినా రోడ్లపై ఇళ్లలోని వస్తువులే దర్శమనిస్తున్నాయి. అయితే తక్కువ ధరకు ఫ్రిజ్ వంటి అయినప్పటికీ
దేశంలోని పరిస్థితులన్నీ రోజురోజుకు దిగజారిపోతున్నాయి. కనీసం మూడుపూటలు కుటుంబ సభ్యులకు తిండిపెట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో అప్ఘన్లు తమ ఇళ్లలోని వస్తువులన్నింటిని రోడ్లపైకి తీసుకొచ్చి వచ్చిన ధరకు అమ్ముకుంటున్నారు. ఈ కారణంగా కాబుల్ లో ఎక్కడ చూసినా రోడ్లపై ఇళ్లలోని వస్తువులే దర్శమనిస్తున్నాయి. అయితే అందరి ఆర్ధిక పరిస్థితి ఒకేలా ఉండడంతో చౌకగా వస్తువులు వస్తున్నా వాటివైపు చూసేవారు లేరు. అంతదారుణంగా ఉంది అక్కడ వారి ఆర్ధిక పరిస్థితి. ఇక ఎవరైనా కొనుగోలు చేయడానికి వస్తున్నా లక్షలు విలువజేసే ఎలక్ట్రానిక్ వస్తువులకు వేల రూపాయలకే ఇవ్వాల్సి వస్తుంది. ఇక బ్యాంకులు సైతం సరిగ్గా పని చేయకపోవడంతో డబ్బుల కోసం జనాలు అల్లాడుతున్నారు.
మరోవైపు అప్ఘన్లో ఆహార నిల్వలు తగ్గిపోవడంతో నిత్యావసర ధరలకు రెక్కలొచ్చాయి. ఓ మాదిరి ధనిక కుటుంబం సైతం కూరగాయలను కొనలేని స్టేజ్ కు చేరుకుంది. కనీసం కిలో బంగాళ దుంపలు కొనాలన్నా ఆలోచించే పరిస్థితులున్నాయి. ఇప్పుడు అక్కడ కిలో ఆలు మన దేశపు కరెన్సీలో మూడు వేలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆఫ్గనిస్తాన్ లో వర్తక వాణిజ్య సంబంధాలను ఇతర దేశాలు తెంపుకున్న నేపథ్యంలో బయటి దేశం నుంచి ఆఫ్గనిస్తాన్ కు ఆహార దిగుమతులు లేకపోవడంతో నిత్యావసర ధరలు రోజురోజుకు మరింత పెరిగిపోతున్నాయి. తమ ను ఆదుకోవాలి అప్ఘన్లు ప్రపంచ దేశాలను కన్నీటితో వేసుకుంటున్నాయి. కనీసం దేశం విడిచి బయటకు వెళ్లే పరిస్థితులు కూడా లేవు. కాబూల్ ఎయిర్ పోర్టును స్వాధీనం చేసుకున్న తాలిబన్లు విమాన రాకపోకలను నిలిపివేశారు. మరోవైపు ఇతర దేశాలతో ఉన్న నగరాల సరిహద్దులను సైతం మూసివేశారు. దీంతో అప్ఘన్లు వారిదేశంలోనే అష్టదిగ్భంధనం చేయబడ్డారు. మరోవైపు దేశంలో ఆకలి కేకలు రాజ్యమేలుతున్నాయి. తొందర్లోనే ఆ దేశంలో 2కోట్లకు పైగా జనాభాకు తిండి దొరకని పరిస్థితి ఉంటుందని 15రోజుల క్రితమే ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే..
Also Read: AP Minister-Tollywood Celebrities: నేడు ఏపీ ప్రభుత్వంతో భేటీ కానున్న సినీ పెద్దలు.. సినీ పరిశ్రమలోని పలు విషయాలపై చర్చించే అవకాశం