Afghan Taliban: పిల్ల చేష్టలంటే ఇవే.. మొన్న జూలో.. నేడు బోట్లల్లో.. తాలిబన్ల ఫొటోలు వైరల్
Afghanistan Taliban: ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశమైన నాటినుంచి ఆ దేశంలో భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత తాలిబన్లు అనుసరిస్తున్న తీరు, ప్రవర్తన అందరినీ నవ్విస్తూ..

Afghanistan Taliban: ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల వశమైన నాటినుంచి ఆ దేశంలో భయంకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆప్ఘన్ ప్రజలు కంటి మీద కునుకులేకుండా వణికిపోతున్నారు. అయితే.. అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత తాలిబన్లు అనుసరిస్తున్న తీరు, ప్రవర్తన అందరినీ నవ్విస్తూ.. ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తాలిబన్ల పిల్ల చేష్టలకు సంబంధించిన వీడియోలు.. పలు ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. కాబూల్‌ను ఆక్రమించిన తర్వాత కొందరు తాలిబన్లు అధ్యక్షుడి భవనం వద్దకు వెళ్లి కుర్చిల్లో కూర్చొని ఫొజులిచ్చారు. ఆ తర్వాత పిల్లలు ఆడుకునే ఎమ్యూజ్‌మెంట్ పార్కుకి వెళ్లి ఆటాలాడుకున్నారు. చిన్న పిల్లలు ఆడుకునే కార్లు, గుర్రాల మీద గన్నులతో షికారు చేశారు. బొమ్మ గుర్రాలు, కార్లపై తాలిబన్లు ఆడుకుంటున్న వీడియోలు చూసి.. వారి మానసిక స్థితిని చాలామంది అంచనా వేశారు. భవిష్యత్తులో వారు అనుసరించే తీరు కూడా ఇలానే ఉంటుందంటూ కామెంట్లు చేశారు. తాజాగా తాలిబన్లకు చెందిన మరికొన్ని ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
Taliban in Bamyan Province…
(These photos are real) pic.twitter.com/oWHJXDpVfZ
— Jake Hanrahan (@Jake_Hanrahan) September 18, 2021
ఆఫ్ఘన్ బామియాన్ నుంచి 45 మైళ్ల దూరంలో హిందూ కుష్ పర్వత ప్రాంతాల్లో ఆరు లోతైన నీలం సరస్సులు ఉన్నాయి. ఈ ప్రాంతమంతా వరల్డ్ టూరిస్ట్ స్పాట్. అయితే.. ఆ పర్వత ప్రాంతంలో తాలిబన్లు ఎంజాయ్ చేస్తున్నారు. హిందూ కుష్ పర్వతల మధ్య ఉన్న సరస్సులో తాలిబాన్లు బోట్లల్లో షికారు చేస్తున్నారు. రాకెట్ లాంఛర్లను ఎక్కుపెట్టి వారు.. బోట్ పెడల్ తొక్కుతూ.. సరస్సులో కనిపించారు. దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలను జర్నలిస్ట్ జేక్ హన్‌రహాన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు నిజమైనవని.. ప్రపంచ టూరిస్ట్ ప్రాంతంలో తాలిబన్లు గన్నులతో షికారు చేస్తూ.. ఆస్వాదిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లంతా.. అంతర్జాతీయ టూరిస్ట్ స్పాట్.. తాలిబన్ స్పాట్ అయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇటువంటి వాళ్లు దేశాన్ని పరిపాలిస్తారా.. అంటూ విమర్శలు చేస్తున్నారు.

Taliban
Also Read: