BJP: అప్పుడు ఓడాము.. ఇప్పుడు గెలవాల్సిందే.. ఆ సీట్లపై కమలదళం స్పెషల్ ఫోకస్

ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతుంటాయి. ప్రజాకర్షక పథకాలతో మేనిఫెస్టో, ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్న అభ్యర్థుల ఎంపిక, సామాజిక సమీకరణాలు, క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణంతో పాటు మరిన్ని ప్రత్యేక కార్యాచరణలను రూపొందిస్తాయి.

BJP: అప్పుడు ఓడాము.. ఇప్పుడు గెలవాల్సిందే.. ఆ సీట్లపై కమలదళం స్పెషల్ ఫోకస్
Bjp
Follow us

| Edited By: Srikar T

Updated on: Apr 10, 2024 | 2:21 PM

ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతుంటాయి. ప్రజాకర్షక పథకాలతో మేనిఫెస్టో, ఆర్థికంగా, సామాజికంగా బలంగా ఉన్న అభ్యర్థుల ఎంపిక, సామాజిక సమీకరణాలు, క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం, అధికారంలో ఉన్న పార్టీలైతే తాము చేసిన పనుల గురించి గొప్పగా ప్రచారం చేసుకోవడం, ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం.. ఇలా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు అనేక రకాలుగా వ్యూహప్రతివ్యూహాలు రచిస్తూ ఉంటాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించడంతో పాటు గతం కంటే ఈసారి మరిన్ని ఎక్కువ సీట్లు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.

ఇందుకోసం అనుసరిస్తున్న అనేక వ్యూహాల్లో అభ్యర్థులను అందరి కంటే ముందే ప్రకటించడం ఒకటి. అభ్యర్థులకు ప్రచారం చేసుకోడానికి ఎక్కువ సమయాన్ని అందించే ఈ వ్యూహం గత ఏడాది చివర్లో జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో సత్ఫలితాలనిచ్చింది. తాము ఇంతవరకు గెలవని స్థానాలతో పాటు, వరుసగా ఓడిపోతూ వస్తున్న స్థానాల్లో ఈసారి గెలుపొందగల్గింది. సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈ వ్యూహాన్ని అనుసరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తేదీలను ప్రకటించేలోగానే సగానికి పైగా స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థుల కంటే ముందంజలో ఉంది. అయితే కమలదళం ఇంతటితో సరిపెట్టలేదు.. తాము నిర్దేశించుకున్న 370 సీట్ల లక్ష్యాన్ని అందుకోడానికి గత ఎన్నికల్లో ఓడిన స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పదునైన వ్యూహాలతో ముందుకెళ్తోంది.

గతంలో ఓడిన స్థానాలపై ఫోకస్..

లోక్‌సభలో 543 స్థానాలున్నప్పటికీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 436 స్థానాల్లో మాత్రమే పోటీ చేయగా, మిగతా స్థానాలను తమ మిత్రపక్షాలకు వదిలేసింది. తాను పోటీ చేసిన స్థానాల్లో 303 గెలుపొందగా, 133 చోట్ల ఓటమి పాలైంది. 2014 సార్వత్రిక ఎన్నికల స్కోరు కంటే సొంతంగానే మరింత సంఖ్యాబలం పెరిగినప్పటికీ.. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ వంటి కొన్ని రాష్ట్రాల్లో ఖాతాయే తెరవలేకపోవడం, కొన్ని చోట్ల డిపాజిట్లు కూడా దక్కనంత ఘోర పరాజయం పాలవడం ఆ పార్టీ జీర్ణించుకోలేపోయింది. ఏ రాజకీయ పార్టీ అయినా తాము పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలవాలని కోరుకుంటుంది. లేదంటే కనీసం గట్టి పోటీనైనా ఇవ్వాలని చూస్తుంది.

ఇవి కూడా చదవండి

కానీ బీజేపీ ఉత్తరాదిన ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొంది, మరికొన్ని రాష్ట్రాల్లో 80-90 శాతానికి పైగా సీట్లను కైవసం చేసుకున్నప్పటికీ, దక్షిణాదిన కర్ణాటక మినహా మిగతా రాష్ట్రాల్లో సాధించిన ఫలితాలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. అందుకే తమ సారథ్యంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)ను విస్తరించి, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కొత్త పొత్తులతో ముందుకెళ్తూ కూటమి స్కోరు పెంచుకునే ప్రయత్నం ఓవైపు చేస్తోంది. మరోవైపు తాము సొంతంగా పోటీ చేస్తున్న స్థానాల్లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ఆ క్రమంలో 2019 ఎన్నికల్లో ఓటమిపాలైన 133 సీట్లలో ద్వితీయస్థానంలో నిలిచి ఓడిన 72 సీట్లను వేరు చేసింది. ఇక్కడ మరింత శ్రమిస్తే వాటిలో కనీసం సగం సీట్లు గెలిచినా తమ స్కోరు మెరుగుపడుతుందని భావిస్తోంది.

బీజేపీ ద్వితీయస్థానంలో నిలిచి ఓడిన 72 సీట్లలో 37 స్థానాల్లో ఆ పార్టీ చరిత్రలో ఇంతవరకు ఒక్కసారి కూడా గెలుపొందలేదు. మిగతా 35 స్థానాల్లో గతంలో గెలుపొందిన సందర్భాలున్నాయి. అలాగే ఓటమి మార్జిన్ (అంతరం) ప్రకారం వర్గీకరిస్తే.. 10 వేల ఓట్ల తేడాతో ఓడినవి 6 స్థానాలుండగా, 10 – 50 వేల ఓట్ల తేడాతో ఓడినవి 10 స్థానాలున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని ఆరాంబాగ్‌లో కేవలం 1,142 ఓట్ల తేడాతో బీజేపీ ఓటమి పాలైంది. అండమాన్ నికోబార్ స్థానంలో 1,407 ఓట్ల తేడాతో ఓడిపోగా, ఉత్తర్‌ప్రదేశ్ శ్రావస్తిలో 5,320 ఓట్ల తేడాతో ఓటమిపాలైంది. ఇలా 10 వేల లోపు ఓట్ల తేడాతో ఓడిపోయిన ఇతర స్థానాల్లో మాల్దా దక్షిణ్ (బెంగాల్), దాద్రానగర్ హవేలి, దక్షిణ గోవా ఉన్నాయి. ఓవరాల్‌గా 50 వేల కంటే తక్కువ ఓట్ల తేడాతో ఓడినవి 16 స్థానాలుండగా, 50 వేల నుంచి 1 లక్ష ఓట్ల తేడాతో ఓడినవి మరో 19 స్థానాలున్నాయి. ఈ రెండు కేటగిరీలు కలిపితే మొత్తం 35 స్థానాలు. వీటితో పాటు లక్ష నుంచి 2 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయిన మరో 22 స్థానాలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేయడం ద్వారా ఈసారి గెలుపొందడానికి ఆస్కారం ఉందని బీజేపీ అగ్రనాయకత్వం అంచనా వేస్తోంది. రాష్ట్రాలవారీగా బీజేపీ ద్వితీయ స్థానంలో నిలిచి ఓడినవాటిలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 22 ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తర్‌ప్రదేశ్ (15), ఒడిశా (11), తమిళనాడు (5), తెలంగాణ (3) నిలిచాయి.

తెలంగాణలో ఆ సీట్లు ఇవే..

గత ఎన్నికల్లో తెలంగాణలోని 17 లోక్‌సభ సీట్లలో బీజేపీ 4 స్థానాల్లో (సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్) గెలుపొందగా, మరో మూడు స్థానాల్లో ద్వితీయస్థానంలో నిలిచి ఓటమి పాలైంది. వాటిలో హైదరాబాద్ స్థానం నుంచి ఆలిండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఓటమి అన్నదే ఎరుగకుండా వరుసగా గెలుపొందుతూ వస్తున్నారు. అయితే ఆ స్థానంలో చాలా సార్లు ద్వితీయ స్థానంలో నిలిచింది మాత్రం భారతీయ జనతా పార్టీయే. ఈసారి అభ్యర్థిని మార్చి ఆ ప్రాంతంలో సామాజిక సేవ కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరైన మాధవీలతను బీజేపీ బరిలోకి దించి ఓవైసీకి సవాల్ విసరాలని చూస్తోంది. ఇక్కడ గత ఎన్నికల్లో అసద్ గెలిచిన మార్జిన్ 2.82 లక్షలు. ఇంత భారీ వ్యత్యాసాన్ని పూడ్చడం అంత సులభమేమీ కాకపోయినా.. బీజేపీ గెలుపు కోసం గట్టిగానే ప్రయత్నాలు సాగిస్తోంది.

బీజేపీ ద్వితీయస్థానంలో నిలిచి ఓడిన మరో సీటు మహబూబ్‌నగర్. ఇక్కణ్ణుంచి గతంలో పోటీ చేసిన డీకే అరుణకే మరోసారి పార్టీ టికెట్ ఇచ్చింది. 2019లో ఎన్నికలకు సరిగ్గా నెల రోజుల ముందు వచ్చి పార్టీలో చేరిన డీకే అరుణ 77,829 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు అప్పగించిన పార్టీ గతంలో ఓడిన సానుభూతి కలిసొస్తుందని అంచనా వేస్తూ ఆమెనే మరోసారి బరిలోకి దించింది. 1999లో బీజేపీ ఇక్కడ గెలుపొందిన చరిత్ర కూడా ఉంది. హైదరాబాద్ నగరానికి ఆనుకున్న ప్రాంతం కావడంతో బీజేపీకి సంస్థాగతంగానూ పట్టుంది. ఐదేళ్లలో వచ్చిన మార్పు, డీకే అరుణకు ఉన్న సొంత పాపులారిటీ, బలం కలిసొస్తాయని కమలనాథులు అంచనా వేస్తున్నారు.

బీజేపీ నేరుగా ద్వితీయస్థానంలో నిలవకపోయినా ఈసారి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి గత ఎన్నికల్లో ద్వితీయ స్థానంలో నిలిచిన స్థానం చేవెళ్ల. అక్కణ్ణుంచి 2019లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి, స్వల్ప తేడాతో ఓడిపోయిన కొండా విశ్వేశ్వర్ రెడ్డికి బీజేపీ టికెట్ ఇచ్చింది. ఆయన గత నాలుగేళ్లుగా బీజేపీలో పనిచేస్తుండడంతో పాటు గతంలో ఓడిపోయిన సానుభూతి వంటి అంశాలు కలిసొస్తాయని పార్టీ అంచనా వేస్తోంది. అయితే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేయడంతో పోటీ రసవత్తరంగా మారింది. వీటితో పాటు భువనగిరి, జహీరాబాద్, నాగర్‌కర్నూలు, వరంగల్, మెదక్ వంటి స్థానాల్లో కూడా బీజేపీ గెలుపుపై ఆశలు పెట్టుకుంది.

దేశంలో బీజేపీ 2 స్థానాల్లో గెలుపుతో తన ప్రయాణం ప్రారంభించగా.. అందులో ఒకటైన నాటి హన్మకొండ నియోజకవర్గం ప్రాంతంలో కూడా పట్టు కోసం గట్టిగా ప్రయత్నాలు సాగిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, 100 రోజుల కాంగ్రెస్ పాలనలో చెప్పిన హామీలన్నీ అమలు చేయలేకపోవడం తమకు కలిసొస్తుందని కమలదళం అంచనా వేస్తోంది. ఏదెలా ఉన్నా.. దేశవ్యాప్తంగా గతంలో ద్వితీయ స్థానంలో నిలిచి ఓడిన 72 స్థానాల్లో ఈసారి 67 చోట్ల బీజేపీ నేరుగా, మిగతా చోట్ల మిత్రపక్షాలు పోటీ చేస్తున్నాయి. వీటిలో వీలైనన్ని ఎక్కువ గెలిస్తే.. తాము ఇదివరకు గెలిచి ఈసారి ఓడిపోయే స్థానాలతో భర్తీ చేయవచ్చని, ఓవరాల్‌గా తాము అనుకున్న లక్ష్యం 370కు దగ్గరగా చేరుకోవచ్చని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?