AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hindu Belief: పాత సంప్రదాయాలు.. కొత్త దిష్టి నివారణ చిట్కాలు..!

దిష్టి తగలకుండా ఉండటానికి మన పెద్దలు పాత సంప్రదాయ పద్ధతులను పాటిస్తారు. పిల్లల మెడలో నల్ల తాడు కట్టడం, నల్ల బొట్టు పెట్టడం లాంటివి ప్రధానంగా ఫాలో అవుతారు. వాహనాలకు నిమ్మకాయలు, కర్పూరం, గుమ్మడికాయలతో దిష్టి తీస్తారు. కానీ ఇప్పుడు ఈవిల్ ఐ లాంటివి ట్రెండ్ లో ఉన్నాయి. బ్లూ కలర్ ఈవిల్ ఐ ప్రధానంగా చెడు దృష్టి ప్రభావం తగ్గించడానికి వాడుతారు. ప్రతి కలర్ ప్రత్యేకతను సూచిస్తుంది. దిష్టి నివారణకు సంప్రదాయ పద్ధతులనూ, ట్రెండింగ్ ఈవిల్ ఐ లాంటి నూతన మార్గాలనూ ప్రజలు పాటిస్తున్నారు.

Hindu Belief: పాత సంప్రదాయాలు.. కొత్త దిష్టి నివారణ చిట్కాలు..!
Evil Eye Image
Prashanthi V
| Edited By: |

Updated on: Jan 11, 2025 | 9:51 PM

Share

దిష్టి తగలకుండా ఉండటానికి మన పెద్దలు అనేక పద్ధతులు పాటిస్తుంటారు. ఎందుకంటే అందంగా, ఆనందంగా ఉన్న వాళ్లను చూసి కొంతమందికి అసూయ కలిగి, చెడు దృష్టి పడుతుందని పెద్దల నమ్మకం. దీని నివారణకు చాలా మంది తమ కాళ్లకు నల్ల తాడు కట్టుకుంటారు. ఇలాంటి ఆచారాలను ఇప్పటికీ అనేక కుటుంబాల్లో పాటిస్తున్నారు. ఇలాంటి వాటి గురించి ఇంకా తెలుసుకుందాం.

పిల్లలకు దిష్టి నివారణ

చిన్న పిల్లలకు దిష్టి తగలకుండా ఉండేలా కొన్ని రకాల ఆచారాలు ఫాలో అవుతుంటారు మన పెద్దలు. పిల్లల మెడలకు వెంట్రుకలతో తయారుచేసిన తాడు కట్టడం, కాయిన్ సైజులో నల్ల బొట్టు పెట్టడం లాంటివి చేస్తుంటారు. ఇది పిల్లలను చూసి వారిని ఎంత అందంగా ఉన్నారో అంటున్న వారిలో పుట్టే దిష్టి ప్రభావాన్ని తగ్గించడానికని పెద్దల నమ్మకం.

వాహనాలకు కూడా ప్రత్యేక పద్ధతులు

వాహనాలకు కూడా చెడు దృష్టి తగలకుండా ఉండటానికి నిమ్మకాయలు, కర్పూరం లేదా గుమ్మడికాయలతో దిష్టి తీస్తుంటారు. ఇవి చెడు దృష్టిని తిప్పి వేసేలా పనిచేస్తాయని మన సంప్రదాయాలు చెబుతున్నాయి. ఈ విధానాలు ఇప్పటికీ మనలో చాలా మంది పాటిస్తున్న విషయం తెలిసిందే.

ఈవిల్ ఐ ప్రాముఖ్యత

ప్రస్తుత కాలంలో “ఈవిల్ ఐ” అనే వస్తువు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ట్రెండ్లో ఉంది. ఈ ఈవిల్ ఐను ప్రధానంగా బ్లూ కలర్ గాజుతో తయారు చేస్తారు. ఇది రౌండ్ గా కనుపాప లాగా ఉంటుంది. దీన్ని మెడలో లాకెట్‌ లాగా కూడా ధరించడం ఇప్పుడు ఫ్యాషన్‌గా మారిపోయింది. చెడు దృష్టి తగలడం వల్ల అనారోగ్య సమస్యలు, ప్రమాదాలు, మరియు దురదృష్టం వంటి ఇబ్బందులు ఎదురవుతాయని అనేక మంది నమ్ముతారు. అలాంటి ప్రభావాల నుంచి బయటపడేందుకు బ్లూ కలర్ ఈవిల్ ఐను ధరించడం ద్వారా దిష్టి తగలదని ఇప్పుడు అందరూ నమ్ముతున్నారు.

స్పెషల్ కలర్స్

వాస్తవానికి ఈవిల్ ఐ సాధారణంగా బ్లూ కలర్ లో మనకు కనపడుతోంది. కానీ ఇప్పుడు వేరే కలర్స్ లో కూడా మనకు లభిస్తున్నాయి. ఒక్కో కలర్ కి ఒక్కో ప్రత్యేకతను తెలియజేస్తుంది. ఉదాహరణకు, బ్లూ కలర్ తేజస్సును సూచిస్తే, ఇంకా వేరే కలర్స్ మరెన్నో ప్రతీకలను సూచిస్తాయి. ఈ విధంగా, ఈవిల్ ఐ ఇప్పుడు దిష్టి నివారణకు ఒక ఇంపార్టెంట్ సొల్యూషన్ గా మారింది.

ఈ విధంగా చెడు దృష్టి ప్రభావాన్ని తగ్గించడానికి మన పెద్దలు పాత పద్ధతులనే కాదు.. కొత్తగా ట్రెండ్ అయిన ఈవిల్ ఐను, ఇతర సంప్రదాయ పద్ధతులను కూడా ఫాలో అవుతున్నారు.