Winter Care Tips: వింటర్ లో బెస్ట్ మెడిసిన్ తులసి.. రోజూ ఇలా తీసుకోండి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా సురక్షితంగా

తులసి హిందూ మతంలో విశిష్ట స్థానం ఉంది. అంతేకాదు ఈ మొక్క ఒక అద్భుతమైన మెడిసిన్. అనేక ఔషధ గుణాలతో నిండి ఉన్నాయి. అందుకే ఆయుర్వేదంలో తులసి మొక్కను చాలా ప్రత్యేకంగా భావిస్తారు. తులసి దళాలను అంటే ఆకులను ఏ సీజన్‌లో ఉపయోగించినా ప్రయోజనకరం.. అయితే శీతాకాలంలో ఉదయం ఖాళీ కడుపుతో కేవలం నాలుగు తులసి ఆకులను తింటే సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ఈ రోజు తులసి దళాలను తినడం వలన కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

Winter Care Tips: వింటర్ లో బెస్ట్ మెడిసిన్ తులసి.. రోజూ ఇలా తీసుకోండి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా సురక్షితంగా
Tulasi Health Benefits
Follow us
Surya Kala

|

Updated on: Jan 11, 2025 | 8:38 PM

చలికాలంలో చలిగాలుల వలన అనేక ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. ఈ సీజన్‌లో ప్రజలు తరచుగా జలుబు, దగ్గు, రోగనిరోధక శక్తి వంటి సమస్యలు ఎదుర్కొంటారు. అటువంటి పరిస్థితిలో మీరు మీ దినచర్యలో తులసి ఆకులను చేర్చుకుంటే.. అది ఓ ఆరోగ్యానికి వరం కంటే తక్కువ కాదు. ఆయుర్వేదంలో ‘మూలికల రాణి’ అని పిలువబడే తులసి..దీని ఔషధ గుణాల కారణంగా భారతీయ కుటుంబాలలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది.

తులసి అనేది మతపరమైన దృక్కోణంలో మాత్రమే కాదు ప్రతిరోజూ తినడం వల్ల శరీర రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా చలికాలంలో తులసిని తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యంగా ఉంటుంది. చలికాలంలో రోజూ నాలుగు తులసి ఆకులను తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.

తులసి ఆకులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని బలోపేతం: తులసి ఆకులలో విటమిన్ సి, జింక్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల తులసి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. చలికాలంలో జలుబు, గొంతునొప్పి వంటి సమస్యల నుంచి కాపాడుతుంది.

ఇవి కూడా చదవండి

జలుబు, దగ్గు నుంచి ఉపశమనం: తులసిని తీసుకోవడం వల్ల కఫం, శ్లేష్మం తగ్గుతాయి. ఇందులోని యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు గొంతు నొప్పి , దగ్గును నయం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. తులసిని రోజూ తింటే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు.

డిటాక్స్ కోసం పనిచేస్తుంది: తులసి ఆకులు శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో సహాయపడతాయి. ఇది శరీరాన్ని లోపలి నుంచి శుభ్రపరుస్తాయి. చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. కనుక రోజూ నాలుగు తులసి ఆకులను తినండి

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: తులసి ఆకులు జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. శీతాకాలంలో ఎక్కువ మంది జీర్ణ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో తులసి వినియోగం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోజూ తులసి ఆకులను తింటే దీని ప్రభావం కనిపిస్తుంది.

ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది: తులసిని సహజమైన యాంటీ డిప్రెసెంట్‌గా పరిగణిస్తారు. దీని వినియోగం సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ లేదా శీతాకాలంలో సంభవించే ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యానికి మేలు: తులసిలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇది రక్తపోటు, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూడా సహాయపడుతుంది. అటువంటి పరిస్థితిలో తినే ఆహారంలో ఖచ్చితంగా తులసి ఆకులను చేర్చుకోండి.

చర్మం, జుట్టుకు మేలు: తులసిని రోజూ తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుతుంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు స్కిన్ ఇన్ఫెక్షన్లను నివారిస్తాయి. అంతే కాదు జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. ఆరోగ్యంగా కూడా చేస్తుంది.

తులసి ఆకులను ఎలా సేవించాలంటే

ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో నాలుగు తాజా తులసి ఆకులను తీసుకోవాలి. తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి హెర్బల్ టీగా త్రాగాలి. తులసిని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల కూడా దీని ప్రయోజనాలు పెరుగుతాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)