పిల్లలలో ఈ లక్షణాలు కనిపిస్తే తస్మాత్ జాగ్రత్త.. ఈ సమస్య ఉందేమో చెక్ చేయండి.. 

11 January 2025

Pic credit-Pexel

TV9 Telugu

కడుపులో పురుగులు పిల్లలలో చాలా సాధారణ సమస్యగా పరిగణించబడుతుంది. అయితే ఈ సమస్యకు సకాలంలో చికిత్స చేయకపోతే.. అది ఆరోగ్యానికి హానికరం.

కడుపులో పురుగులు

కడుపులో నులి పురుగుల సమస్య ఏ వయసులోనైనా రావచ్చు. అయితే ఈ సమస్య పెద్దవారిలో కంటే పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

సాధారణ సమస్య

పిల్లలకు కడుపులో నులిపురుగులు ఉన్నప్పుడు అనేక రకాల లక్షణాలు కనిపిస్తాయి. అందువల్ల ఆ లక్షణాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఎలా గుర్తించాలంటే 

పిల్లలకు కడుపులో నులిపురుగులు ఉంటే కడుపునొప్పి, మలంలో పురుగులు, విరేచనాలు, ఆకలి లేకపోవటం లేదా ఆకస్మికంగా ఆకలి వంటి లక్షణాలు కనిపిస్తాయి.

లక్షణాలు

ఈ లక్షణాలు పిల్లలలో కనిపిస్తే.. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. దీని తర్వాత డాక్టర్ పరీక్షలు, సరైన చికిత్సతో పాటు నివారణకు సలహా ఇస్తారు.

డాక్టర్ సలహా

ఉడకని పండ్లు తినడం, మురుకి చేతులతో తినడం, మట్టిలో ఆడుకోవడం, మురికి నీరు తాగడం, పరిశుభ్రతపై శ్రద్ధ చూపకపోవడం వల్ల కడుపులో నులిపురుగులు వస్తాయి.

కారణం

పరిసరాల శుభ్రత, పిల్లల పరిశుభ్రతపై కూడా శ్రద్ధ వహించండి. కూరగాయలు, పండ్లను బాగా కడగండి, తినడానికి ముందు చేతులు కడుక్కోవడం అలవాటు చేసుకోండి.

ఈ విషయాలను గుర్తుంచుకోండి