బంపర్ ఆఫర్.. బైక్ నుంచి ఫ్లైట్ వరకూ.. అన్ని ప్రయాణాలపై..ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ..!నేడు మాత్రమే..
ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడి ప్రజలకు బంపర్ ఆఫర్లు వచ్చాయి. అది కూడా ఇవాళ ఒక్కరోజు మాత్రమే. ఇవాళ జరుగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ఎలక్షన్ కమిషన్ ఓటర్లను ప్రోత్సహించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రైవేట్ వాహన రంగ సంస్థలు కూడా నడుం బిగించాయి. సగటు ఓటర్ తన అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకునేందుకు దోహదపడేలా.. ఢిల్లీలోని ప్రైవేట్ రవాణా సంస్థలు పలు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించాయి. ఇందులో బైక్, ఆటో, బస్సులే […]
ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడి ప్రజలకు బంపర్ ఆఫర్లు వచ్చాయి. అది కూడా ఇవాళ ఒక్కరోజు మాత్రమే. ఇవాళ జరుగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. ఎలక్షన్ కమిషన్ ఓటర్లను ప్రోత్సహించేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలో ప్రైవేట్ వాహన రంగ సంస్థలు కూడా నడుం బిగించాయి. సగటు ఓటర్ తన అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకునేందుకు దోహదపడేలా.. ఢిల్లీలోని ప్రైవేట్ రవాణా సంస్థలు పలు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించాయి. ఇందులో బైక్, ఆటో, బస్సులే కాకుండా.. విమానయాన సంస్థలు కూడా ఉన్నాయి.
బైక్-టాక్సీ బుకింగ్ యాప్ రాపిడో.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేవారి కోసం ఫ్రీ రైడింగ్ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఓటర్లకు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న పోలింగ్ బూత్ వరకూ.. తమ బైక్ సర్వీసులు ఫ్రీగా ప్రొవైడ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ సేవలను ఉదయం పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి.. సాయంత్రం 6 గంటల వరకూ అందిస్తున్నట్లు పేర్కొంది. ఇక “అభీ బస్ డాట్ కామ్” కూడా “ఐ ఓట్.. ఐ విన్” అనే నినాదంతో ఓటర్లకు ఫ్రీ బస్సు సర్వీసులను అందిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. ఇక విమానయాన సంస్థ కూడా ఈరోజు ఓటర్లకు ఫ్రీ సర్వీసు అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇవాళ స్పైస్ జెట్‌లో ఢిల్లీ వచ్చేవారు.. మళ్లీ ఇదే రోజు తిరిగి వెళ్లే వారికి రెండు టిక్కెట్లపై ఉండే బేస్ టిక్కెట్ ఛార్జీని తిరిగి ఇవ్వనున్నట్లు తెలిపింది.