రాజ్యసభలో మోదీకి వెంకయ్య ఝలక్.. ప్రసంగంలోని పదాలు తొలగింపు..!
ప్రధాని నరేంద్ర మోదీకి ఊహించని షాక్ తగిలింది. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు.. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై.. గురువారం మోదీ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలోని ఒక పదాన్ని రాజ్యసభ రికార్డుల నుంచి తొలగించారు. ఫిబ్రవరి 6వ తేదీ సాయంత్రం 6.20 నుంచి 6.30 గంటల మధ్య జరిగిన ప్రసంగంలో.. కొంత భాగాన్ని రికార్డుల నుంచి తొలగించాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆదేశించారని.. రాజ్యసభ సెక్రటేరియట్ ప్రకటించింది. రోజువారీ విధుల్లో భాగంగా.. […]
ప్రధాని నరేంద్ర మోదీకి ఊహించని షాక్ తగిలింది. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు.. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై.. గురువారం మోదీ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఈ ప్రసంగంలోని ఒక పదాన్ని రాజ్యసభ రికార్డుల నుంచి తొలగించారు. ఫిబ్రవరి 6వ తేదీ సాయంత్రం 6.20 నుంచి 6.30 గంటల మధ్య జరిగిన ప్రసంగంలో.. కొంత భాగాన్ని రికార్డుల నుంచి తొలగించాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆదేశించారని.. రాజ్యసభ సెక్రటేరియట్ ప్రకటించింది.
రోజువారీ విధుల్లో భాగంగా.. రాజ్యసభ చైర్మన్ ప్రతీరోజు సభ ముగిసిన అనంతరం.. ఆ రోజు అయిన ప్రసంగాల్లో రికార్డుల నుంచి తొలగించాల్సిన పదాలను గుర్తించడమే కాకుండా.. వాటిని రికార్డుల నుంచి తొలగించాలని ఆదేశిస్తుంటారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియే అని అధికారులు వెల్లడించారు. అయితే.. ఓ ప్రధాని ప్రసంగంలోని పదాలను తొలగించడమనేది అసాధారణమైనదన్నారు. జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)ను సమర్ధిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఆవేశంగా మాట్లాడుతున్న సందర్భంగా.. ఓ పదాన్ని ఉపయోగించారని.. ఆ పదాన్ని తొలగించినట్లు పేర్కొన్నారు. అటు కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ప్రసంగంలోని ఒక పదాన్ని కూడా తొలగించాలని చైర్మన్ ఆదేశించారని తెలిపారు.