ఈ సైన్యాధికారికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. మన జవాన్ల కోసం ఏం చేశాడంటే..?
బార్డర్లో ఇతర దేశాలతో యుద్ధం లేకున్నా.. నిత్యం పొరుగు దేశం పాక్ చేసే కవ్వింపు చర్యలు.. మరోవైపు ఉగ్రవాదుల దుశ్చర్యలతో తరచూ మన భారత జవాన్లు ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. అయితే వీరిలో చాలా మంది బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు ధరించినా కూడా.. పలు సందర్భాల్లో తలకు బుల్లెట్లు తగిలి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. దీంతో భారత సైన్యాధికారి మేజర్ అనూప్ మిశ్రా ఈ విషయంపై దృష్టిసారించారు. ఇప్పటికే ఆయన బుల్లెట్ల నుంచి రక్షణకు […]
బార్డర్లో ఇతర దేశాలతో యుద్ధం లేకున్నా.. నిత్యం పొరుగు దేశం పాక్ చేసే కవ్వింపు చర్యలు.. మరోవైపు ఉగ్రవాదుల దుశ్చర్యలతో తరచూ మన భారత జవాన్లు ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. అయితే వీరిలో చాలా మంది బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్లు ధరించినా కూడా.. పలు సందర్భాల్లో తలకు బుల్లెట్లు తగిలి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. దీంతో భారత సైన్యాధికారి మేజర్ అనూప్ మిశ్రా ఈ విషయంపై దృష్టిసారించారు. ఇప్పటికే ఆయన బుల్లెట్ల నుంచి రక్షణకు బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్‌ను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన మరో ఘనత కూడా సాధించారు. 10 మీటర్ల దూరంలోని ఏకే-47 రైఫిల్ నుంచి వేగంగా దూసుకొచ్చే బుల్లెట్లనూ.. నిరోధించే సామర్థ్యం గల బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్‌ను రూపొందించారు. ఇది ప్రపంచంలోనే తొలి బుల్లెట్ ఫ్రూఫ్ హెల్మెట్‌గా రికార్డులకెక్కింది.
అభేద్య ప్రాజెక్టు కింద.. మేజర్ అనూప్ మిశ్రా ఈ బాలిస్టిక్ హెల్మెట్‌ను అభివృద్ధి చేశారని సైన్యాధికారులు శుక్రవారం ప్రకటించారు. శరీరానికి పూర్తిస్థాయి రక్షణనిచ్చే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించిన వారిపై.. ఎంతపెద్ద బుల్లెట్ల వర్షం కురిసినా వారికేం కాదని తెలిపారు. ఇండియన్ ఆర్మీ కాలేజీ ఆఫ్ మిలిటరీ ఇంజినీరింగ్‌లో పని చేస్తున్నప్పుడు అనూప్ మిశ్రా దీన్ని రూపొందించారని.. ఇప్పుడు ఈ బుల్లెట్ ఫ్రూఫ్ హెల్మెట్‌కు రూపకర్తగా రికార్డులకెక్కారని కొనియాడారు.