‘నా ఆరో సెన్స్ చెబుతోంది.’ మనోజ్ తివారీ

‘ నా మెదడులో ప్రకంపనలు, నా ఆరో సెన్స్ చెబుతున్నాయి.. ఈ సారి ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని’ అన్నారు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ.. భోజ్ పురి  నటుడు, సింగర్ కూడా అయిన ఈయన.. శనివారం తన ఓటుహక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆరో సెన్స్ మీద ఎవరు నమ్మకం పెట్టుకున్నా.. పెట్టుకోక పోయినా.. తనకు మాత్రం నమ్మకం ఉందని, ఈ సెన్స్ ఇదే చెబుతోందని అన్నారు. ప్రజల ఆశీస్సులతో బాటు […]

  • Umakanth Rao
  • Publish Date - 11:39 am, Sat, 8 February 20
'నా ఆరో సెన్స్ చెబుతోంది.' మనోజ్ తివారీ

‘ నా మెదడులో ప్రకంపనలు, నా ఆరో సెన్స్ చెబుతున్నాయి.. ఈ సారి ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని’ అన్నారు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ.. భోజ్ పురి  నటుడు, సింగర్ కూడా అయిన ఈయన.. శనివారం తన ఓటుహక్కు వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఆరో సెన్స్ మీద ఎవరు నమ్మకం పెట్టుకున్నా.. పెట్టుకోక పోయినా.. తనకు మాత్రం నమ్మకం ఉందని, ఈ సెన్స్ ఇదే చెబుతోందని అన్నారు. ప్రజల ఆశీస్సులతో బాటు నా తల్లి ఆశీస్సులు కూడా నాకున్నాయి. అందువల్ల బీజేపీ విజయం తథ్యం.. అని చెప్పారు. తన బర్త్ డే కి హాజరయ్యేందుకు తన తల్లి వారణాసి నుంచి ఈ నెల 1 న ఢిల్లీకి వచ్చిందని,   అప్పటి నుంచి ఉపవాసం ఉంటోందని ఆయన తెలిపారు. శనివారం పోలింగ్ ముగిసిన అనంతరమే ఆమె తిరిగి వారణాసి వెళ్తుందన్నారు. ఈ ఎన్నికల్లో తాము 50 కి మించి సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేసిన తివారీ.. ప్రజల ఆశీర్వాదాలు ప్రధానిమోదీకి ఉన్నాయి గనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. మీరు సీఎం అవుతారా అన్న ప్రశ్నకు.. ముసిముసి నవ్వులు నవ్వుతూ .. ఎవరో ఒక మంచి వ్యక్తి కావడం తథ్యమని చెప్పారు.

2015 లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ 70 అసెంబ్లీ స్థానాలకు గాను 67 సీట్లను గెలుచుకోగా.. బీజేపీ మూడు స్థానాలను మాత్రం దక్కించుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. కానీ.. గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ ఏడు స్థానాలలోనూ విజయం సాధించింది.