మోసపూరిత యాడ్స్‌పై కేంద్రం పంజా.. జైలు శిక్ష, భారీ జరిమానా…
New Draft Bill By Central Government: మీ చర్మం ఆయిలీగా ఉందా.. అయితే ఈ క్రీమ్ వాడండి ఇట్టే తెల్లబడిపోతారు.. మీకు సంతానం కలగట్లేదా.. ఈ మందు వాడండి చాలు.. పిల్లలు పుడతారు.. ఇలాంటి యాడ్స్ మనం రెగ్యులర్‌గా టీవీల్లో చూస్తూనే ఉంటాం. వీటన్నింటికి సామాన్యులు ఎట్రాక్ట్ కావడమే కాకుండా నమ్మేసి మరీ ఆ ఉత్త్పత్తులను భారీ నగదు చెల్లించి కొంటుంటారు. అయితే వాటితో ఏ ఉపయోగం ఉండదు. అందుకనే మున్ముందు వినియోగదారులు ఈ ప్రకటనలు […]
New Draft Bill By Central Government: మీ చర్మం ఆయిలీగా ఉందా.. అయితే ఈ క్రీమ్ వాడండి ఇట్టే తెల్లబడిపోతారు.. మీకు సంతానం కలగట్లేదా.. ఈ మందు వాడండి చాలు.. పిల్లలు పుడతారు.. ఇలాంటి యాడ్స్ మనం రెగ్యులర్‌గా టీవీల్లో చూస్తూనే ఉంటాం. వీటన్నింటికి సామాన్యులు ఎట్రాక్ట్ కావడమే కాకుండా నమ్మేసి మరీ ఆ ఉత్త్పత్తులను భారీ నగదు చెల్లించి కొంటుంటారు. అయితే వాటితో ఏ ఉపయోగం ఉండదు. అందుకనే మున్ముందు వినియోగదారులు ఈ ప్రకటనలు చూసి మోసపోకూడదనే ఉద్దేశంతో కేంద్రం చెక్ పెట్టేందుకు సిద్ధమైంది. ఇకపై ఇలాంటి అసత్య ప్రచారాలు, ప్రకటనలు చేసే కంపెనీల నిర్వాహకులు, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లే బ్రాండ్ అంబాసిడర్లకు 5 ఏళ్ళ జైలు శిక్షతో పాటు.. రూ.50 లక్షల భారీ జరిమానాను విధించనుంది.
ఈ మేరకు కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వశాఖ డ్రగ్స్, మ్యాజిక్ రెమిడీస్‌కు ముసాయిదా సవరణను ప్రతిపాదించింది. దీని ప్రకారం సుమారు 78 రకాల వ్యాధులు, రుగ్మతలకు సంబంధించిన ప్రకటనలపై నిషేధం పడనుంది. శృంగార సామర్ధ్యం, ఎయిడ్స్, చర్మ రంగును మార్చే సౌందర్య ఉత్త్పత్తులు, జుట్టు రంగు మార్చడం, మహిళలకు సంబంధించిన వ్యాధులు వంటి వాటిని ఈ కొత్త చట్టంలో చేర్చారు.
ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే.. మొదటిసారి నేరానికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధిస్తారు. అదే రెండోసారి తప్పు చేస్తే 5 ఏళ్ళ జైలు శిక్షతో పాటుగా రూ.50 లక్షల భారీ జరిమానా విధిస్తారు. కాగా, ఈ ప్రకటనలు కేవలం టీవీల్లో మాత్రమే కాదు.. ఆడియో, ప్రచురణ, సోషల్ మీడియా, ఇంటర్నెట్, వెబ్‌సైట్, నోటీస్, పత్రికా ప్రకటన, బ్యానర్, పోస్టర్ ఇలా అన్నింటిల్లోనూ నిషేధించనున్నారు.