లవ్ తీసిన ప్రాణం.. మహిళా ఎస్సై దారుణ హత్య
ప్రేమ ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది.. తనకు దక్కని యువతి మరొకరికి దక్కకూడదన్న ఆగ్రహంతో ఓ ఎస్సై.. తన తోటి మహిళా ఎస్సైనే కాల్చి చంపాడు. ఢిల్లీలోని రోహిణీ నగర్ ప్రాంతంలో జరిగిందీ దారుణ ఘటన.. ప్రీతి ఆహ్లవాత్ అనే 26 ఏళ్ళ మహిళా సబ్ ఇన్స్ పెక్టర్ ఈ ప్రాంత పరిధిలోని పోలీసు స్టేషన్ లో విధులు నిర్వరిస్తోంది. 2018 బ్యాచ్ కి చెందిన దీపాంషు రతి అనే ఎస్సై ఈమెను కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. పెళ్లి […]
ప్రేమ ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది.. తనకు దక్కని యువతి మరొకరికి దక్కకూడదన్న ఆగ్రహంతో ఓ ఎస్సై.. తన తోటి మహిళా ఎస్సైనే కాల్చి చంపాడు. ఢిల్లీలోని రోహిణీ నగర్ ప్రాంతంలో జరిగిందీ దారుణ ఘటన.. ప్రీతి ఆహ్లవాత్ అనే 26 ఏళ్ళ మహిళా సబ్ ఇన్స్ పెక్టర్ ఈ ప్రాంత పరిధిలోని పోలీసు స్టేషన్ లో విధులు నిర్వరిస్తోంది. 2018 బ్యాచ్ కి చెందిన దీపాంషు రతి అనే ఎస్సై ఈమెను కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకుందామన్న ఇతని ప్రపోజల్‌ను ఆమె తిరస్కరించడంతో ఆగ్రహం పట్టలేకపోయాడు. శుక్రవారం రాత్రి తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ప్రీతి డ్యూటీ ముగించుకుని ఇంటికి నడిచి వెళ్తుండగా.. దీపాంషు ఆమెపై కాల్పులు జరిపాడు. తలలోకి బులెట్లు దూసుకుపోవడంతో ప్రీతి అక్కడికక్కడే మరణించింది. ఆమెను హత్య చేశాక..దీపాంషు హర్యానాలోని తన స్వస్థలానికి వెళ్లి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ..ఈ ఘటన సంచలనం సృష్టించింది.