కేజ్రీవాల్ నకిలీ భక్తుడట ! బీజేపీ ఎద్దేవా.. తిప్పికొట్టిన ఢిల్లీ సీఎం
ఢిల్లీ ఎన్నికల సందర్భంగా పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం అరవింద్ కేజ్రీవాల్ పైన, ఆయన ఆలయ పూజలపైన, బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సందిస్తుండగా.. తానేమీ తక్కువతినలేదన్నట్టు కేజ్రీ కూడా తన ట్విట్టర్ లో ఆ పార్టీని ఏకిపారేస్తున్నారు. గత గురువారం ఆయన నగరంలోని ఓ హనుమాన్ ఆలయంలోకి వెళ్లి అక్కడ ప్రార్థనలు చేసిన వీడియోను ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా.. కేజ్రీవాల్ ఈ గుడిలో ప్రవేశించే ముందు తన […]
ఢిల్లీ ఎన్నికల సందర్భంగా పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం అరవింద్ కేజ్రీవాల్ పైన, ఆయన ఆలయ పూజలపైన, బీజేపీ వ్యంగ్యాస్త్రాలు సందిస్తుండగా.. తానేమీ తక్కువతినలేదన్నట్టు కేజ్రీ కూడా తన ట్విట్టర్ లో ఆ పార్టీని ఏకిపారేస్తున్నారు. గత గురువారం ఆయన నగరంలోని ఓ హనుమాన్ ఆలయంలోకి వెళ్లి అక్కడ ప్రార్థనలు చేసిన వీడియోను ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా.. కేజ్రీవాల్ ఈ గుడిలో ప్రవేశించే ముందు తన కాళ్ళ చెప్పులను గడప వద్ద వదిలి.. ఆలయంలోపల హనుమాన్ విగ్రహానికి అవే చేతులతో పూలమాల వేసిన దృశ్యాన్ని తివారీ ‘హైలైట్’ చేశారు. ఇలా చేసి కేజ్రీ ఆలయాన్ని అపవిత్రం చేశారని ఆరోపించారు. ఈ సీఎం నకిలీ భక్తుడని విమర్శించారు. అయితే.. భగవంతుడు బీజేపీతో సహా అందరివాడని, ప్రతివారూ దేవుడిని పూజించవచ్ఛునని కేజ్రీ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘ ఇవేం రాజకీయాలు’ ? అని ప్రశ్నించిన ఆయన.. తాను రోజూ హనుమాన్ చాలీసా పఠిస్తానని, గుడి తలుపుల ముందు తన చెప్పులను వదిలినంత మాత్రాన, దేవునిపై తన భక్తి గురించి తనకు తెలుసునన్నారు. మరోవైపు.. ఆప్ నేత సంజయ్ సింగ్.. బీజేపీ నేతలను ఉద్దేశించి.. మీరింకా దళితులను ఆలయంలోకి ప్రవేశించనివ్వని అగ్రవర్ణాల కాలంలోనివారిలాగే ఉన్నారని ఎత్తిపొడిచారు. మీ పార్టీని రాముడు కూడా రక్షించలేడని దుయ్యబట్టారు.
जब से मैंने एक TV चैनल पे हनुमान चालीसा पढ़ा है, भाजपा वाले लगातार मेरा मज़ाक़ उड़ा रहे हैं। कल मैं हनुमान मंदिर गया।आज भाजपा नेता कह रहे हैं कि मेरे जाने से मंदिर अशुद्ध हो गया। ये कैसी राजनीति है? भगवान तो सभी के हैं। भगवान सभी को आशीर्वाद दें, भाजपा वालों को भी।
सबका भला हो
— Arvind Kejriwal (@ArvindKejriwal) February 8, 2020
देखिये, चुनावी हनुमानभक्त केजरीवाल का सच… जिन हाथों से जूते उतारे, उन्हीं हाथों से फेंकी बाबा पर फूलों की माला! pic.twitter.com/R1NL6X8aoM
— Manoj Tiwari (@ManojTiwariMP) February 6, 2020
Manoj Tiwari, BJP: Woh (Arvind Kejriwal) pooja karne gaye the ya Hanuman Ji ko ashudh karne gaye the? Ek haath se joota utaarke,ussi haath se mala lekar…kya kar diya? Jab nakli bhakt aate hain na toh yahi hota hai. Maine pandit ji ko bataya, bahut baar Hanuman Ji ko dhoye hain. pic.twitter.com/lETgFhgfK7
— ANI (@ANI) February 8, 2020