AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: రెస్టారెంట్‌లో కూర్చున్న అమ్మాయి దగ్గరకు వచ్చిన రోబో.. వెనక నుంచి ఏం చేసిందో తెలిస్తే..

టెక్నాలజీని అడ్డుపెట్టుకొని అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి సంఘటనే జర్మినీలో వెలుగు చూసింది. రెస్టారెంట్‌లో ఫుడ్‌ తింటున్న ఓ 16 ఏళ్ల బాలికపై రిమోట్ కంట్రోల్‌ హ్యూమనాయిడ్ రోబో సహాయంతో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు యువకులును పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఇందుకుసంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Viral News: రెస్టారెంట్‌లో కూర్చున్న అమ్మాయి దగ్గరకు వచ్చిన రోబో.. వెనక నుంచి ఏం చేసిందో తెలిస్తే..
Humanoid Robot Used For Teen Harassment In Germany
Anand T
|

Updated on: Oct 13, 2026 | 12:56 PM

Share

పెరుగుతున్న టెక్నాలజీ వాడి కొందరు అద్భుతాలు సృష్టిస్తుంటే.. అదే టెక్నాలజీని ఉపయోగించి మరికొందరు నేరాలకు, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే శనివారం10 అర్ధరాత్రి జర్మనీలోని కొలోన్ నగరంలో ఉన్న పామ్‌స్ట్రాస్సే ప్రాంతంలోని ఓ ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. 16 ఏళ్ల ఓ బాలిక రెస్టారెంట్‌లో ఫుడ్‌ తింటూ ఉండగా.. రెండ్ అండ్ గోల్డ్‌ కలర్‌లో దాదాపు 4 అడుగుల ఎత్తున్న ఓ హ్యూమనాయిడ్ రోబో ఆమె దగ్గరకు వచ్చింది. అంతటితో ఆగకుండా.. ఆ రోబో బాలిక పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ, ఆమెను తాకుతూ అసభ్యకరమైన చేష్టలు చేసింది.

అయితే ఆ రోబోనూ రెస్టారెంట్‌కు కొద్ది దూరంలో పార్క్‌ చేసిన ఓ కారులో కూర్చున్న ఇద్దరు యువకులు రిమోట్ కంట్రోల్‌ ద్వారా ఆ రోబోను ఆపరేట్ చేస్తూ.. అందుకు సంబంధించిన వీడియోను టిక్‌టాక్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇందులో 19 ఏళ్ల యువకుడు ఈ దృశ్యాలను రికార్డ్ చేస్తూ ప్రసారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ వీడియో కాస్త వైరల్ అవ్వడంతో అప్రమత్తమైన పోలులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరు యువకులతో పాటు ఆ రోబోను సైతం స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడి సమయంలో ఆ రోబోకు వీడియోలో కనిపించిన స్లీవ్‌లెస్ వైట్ షర్ట్, స్వెట్‌ప్యాంట్స్, కళ్లద్దాలు తొడిగి ఉన్నట్టు గుర్తించారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లైంగిక వేధింపులకు పాల్పడే ఉద్దేశంతోనే సదురు యువకులు రోబోను కంట్రోల్ చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అమ్మాయితో రోబో అసభ్యప్రవర్తన.. పోలీసుల దర్యాప్తులో
అమ్మాయితో రోబో అసభ్యప్రవర్తన.. పోలీసుల దర్యాప్తులో
'రిటైర్ అవ్వాలి.. లేదంటే జట్టును వీడాలి'
'రిటైర్ అవ్వాలి.. లేదంటే జట్టును వీడాలి'
సినిమా ఛాన్స్ కోసం ఆ డైరెక్టర్ అలాంటి డిమాండ్ చేశాడా..
సినిమా ఛాన్స్ కోసం ఆ డైరెక్టర్ అలాంటి డిమాండ్ చేశాడా..
'ఆ తెలుగు సినిమా అంటే పిచ్చి.. ఇప్పటివరకు 50 సార్లు చూశా'
'ఆ తెలుగు సినిమా అంటే పిచ్చి.. ఇప్పటివరకు 50 సార్లు చూశా'
చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామి..
చిన్నశేష వాహనంపై ద్వారకా శ్రీకృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామి..
మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయడం ఎలా..
మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోయినా యూపీఐ పేమెంట్స్ చేయడం ఎలా..
కొవ్వును కరిగించి.. జుట్టుకు, గుండెకు మేలు చేసేచ అద్భుతమైన ఫుడ్..
కొవ్వును కరిగించి.. జుట్టుకు, గుండెకు మేలు చేసేచ అద్భుతమైన ఫుడ్..
టీ20ల్లో బుడ్డోడి అరాచకంపై ఓ లుక్కేయండి..!
టీ20ల్లో బుడ్డోడి అరాచకంపై ఓ లుక్కేయండి..!
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
భోజనం పెడితే లక్ష..భోజనం చేస్తే రూ.50 వేలు జరిమానా..ఎక్కడో తెలుసా
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌..డిసెంబర్‌ నుంచి నీటి కష్టాలు తప్పవా?
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్‌..డిసెంబర్‌ నుంచి నీటి కష్టాలు తప్పవా?