AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘రిటైర్ అవ్వాలి.. లేదంటే జట్టును వీడాలి’.. ఆ ఇద్దరిపై మాజీ సెలెక్టర్ సంచలన వ్యాఖ్యలు..!

Sandeep Patil Selection Controversy: మాజీ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ సచిన్, యువరాజ్, గంభీర్ వంటి దిగ్గజాలు భారత జట్టును ఎందుకు వీడాల్సి వచ్చిందో వారికి తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత సంబంధాల కంటే భారత క్రికెట్ భవిష్యత్తుకే తమ సెలక్షన్ కమిటీ ప్రాధాన్యత ఇచ్చిందని స్పష్టం చేశారు.

'రిటైర్ అవ్వాలి.. లేదంటే జట్టును వీడాలి'.. ఆ ఇద్దరిపై మాజీ సెలెక్టర్ సంచలన వ్యాఖ్యలు..!
Yuvraj Singh, Gautam Gambhir Careers
Venkata Chari
|

Updated on: Oct 13, 2026 | 12:52 PM

Share

Sandeep Patil Selection Controversy: మాజీ భారత క్రికెటర్, మాజీ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్ వంటి దిగ్గజ ఆటగాళ్లు భారత జట్టుకు దూరం కావడానికి గల కారణాలు వారికి తెలుసని ఆయన పేర్కొన్నారు. వ్యక్తిగత సంబంధాల కంటే భారత క్రికెట్ భవిష్యత్తుకే తమ సెలక్షన్ కమిటీ ప్రాధాన్యత ఇచ్చిందని వెల్లడించారు.

1983 వన్డే ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టులో సభ్యుడైన సందీప్ పాటిల్.. 2012 నుంచి 2016 వరకు ఐదుగురు సభ్యులున్న భారత సీనియర్ పురుషుల సెలక్షన్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో భారత క్రికెట్‌లో కీలక మార్పుల దశ కొనసాగింది. ‘‘మొదట ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఈ నిర్ణయాలు తీసుకున్నది నేను ఒక్కడినే కాదు. ఐదుగురు సభ్యులతో సెలక్షన్ కమిటీ ఉండేది. అందులో నేను చైర్మన్‌గా ఉన్నాను. మేం తీసుకున్న ప్రతి నిర్ణయం భారత క్రికెట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఉండేది’’ అని పాటిల్ తెలిపారు.

ఎక్కువమంది చదివినది: 6,W,6,W,6,W,6,W,6,W.. సిక్స్ కొడితే ఔటే.. బ్యాటర్లను భయపెడుతోన్న టీమిండియా బౌలర్..!

ఇవి కూడా చదవండి

‘‘ఈ విషయం ఇప్పుడు ప్రస్తావించడం బాధగా ఉంది. కానీ సచిన్ టెండూల్కర్, గౌతమ్ గంభీర్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్ వంటి గొప్ప ఆటగాళ్లు జట్టును వీడాల్సి వచ్చింది లేదా రిటైర్ కావాల్సి వచ్చింది. వారు జట్టుకు ఎందుకు దూరమయ్యారో వారికి తెలుసు. సెలెక్టర్లుగా మా బాధ్యత దేశం, బీసీసీఐ, భారత క్రికెట్ ప్రయోజనాలను ముందుగా చూడటం’’ అని ఆయన చెప్పారు. దూరదర్శన్‌లో ప్రసారమైన ‘ది గ్రేట్ ఇండియన్ క్రికెట్ షో’ కార్యక్రమంలో పాల్గొన్న పాటిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన ముంబై సీనియర్, పురుషుల జట్లకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు.

2011 వన్డే ప్రపంచకప్‌ విజయం తర్వాత భారత క్రికెట్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పలువురు సీనియర్ ఆటగాళ్ల స్థానాల్లో యువ క్రికెటర్లకు అవకాశాలు లభించాయి. వివిధ ఫార్మాట్లలో జట్టు కూర్పులోనూ మార్పులు జరిగాయి.

ఎక్కువమంది చదివినది: బ్రేకప్‌కు బ్రేక్.. మళ్లీ ఒక్కటైన పృథ్వీ షా, ఆకృతి అగర్వాల్.. అసలు ఏం జరిగిందంటే?

సెలెక్టర్లు, ఆటగాళ్ల మధ్య వ్యక్తిగత స్నేహం ఉన్నా.. ఎంపిక విషయంలో దానికి ప్రాధాన్యత ఇవ్వకూడదని పాటిల్ స్పష్టం చేశారు. ‘‘మీరు ఆటగాళ్లతో స్నేహంగా ఉండొచ్చు. కానీ ఒక హద్దు ఉండాలి. అతను నా స్నేహితుడు కాబట్టి జట్టులోకి తీసుకోవాలని అనుకోకూడదు. సెలెక్టర్‌గా బాధ్యత అప్పగించినప్పుడు దాన్ని ఎంతో సీరియస్‌గా తీసుకోవాలి’’ అని అన్నారు. ‘‘మీరు మీ వ్యక్తిగత క్రికెట్ గురించి ఆలోచించడం లేదు. భారత క్రికెట్, దాని భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. కొన్నిసార్లు మీకు నచ్చని నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే భారత జట్టు మేలు కోసమే వాటిని తీసుకోవాలి’’ అని సందీప్ పాటిల్ పేర్కొన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us