AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anupama Parameswaran: ‘ఆ తెలుగు సినిమా అంటే పిచ్చి.. ఇప్పటివరకు 50 సార్లు చూశా’.. ఆసక్తికర విషయం చెప్పిన అనుపమ

అనుపమా పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన క్రేజీ కల్యాణం దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్లలో విస్తృతంగా పాల్గొంటోంది అనుపమ. ఈ క్రమంలోనే తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెబుతోంది.

Anupama Parameswaran: 'ఆ తెలుగు సినిమా అంటే పిచ్చి.. ఇప్పటివరకు 50 సార్లు చూశా'.. ఆసక్తికర విషయం చెప్పిన అనుపమ
Anupama Parameswaran
Basha Shek
|

Updated on: Oct 13, 2026 | 12:40 PM

Share

చేతి నిండా సినిమాలతో ప్రస్తుతం బిజీ బిజీగా ఉంటోంది మలయాళం కుట్టీ అనుపమా పరమేశ్వరన్. ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తోందీ ముద్దుగుమ్మ. గతేడాది ఏకంగా ఆరు సినిమాల్లో నటించి మెప్పించింది అనుపమ. ఇక ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ఆడియెన్స్ ను పలకరించింది. ఇప్పుడు క్రేజీ కల్యాణం అనే మరో సినిమాతో మన ముందుకు రానుందీ అందాల తార. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ దసరా కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్లలో స్పీడ్ పెంచారు మేకర్స్. హీరోయిన్ అనుపమ కూడా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతోంది. ఈ క్రమంలోనే తన వృత్తి, వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన సినిమా గురించి మాట్లాడింది అనుపమ. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీడేస్ మూవీ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపిందీ. ఆ మూవీని ఇప్పటి వరకు దాదాపు 50 సార్లు చూశానని, ఇప్పటికీ కూడా టీవీలో వస్తే తప్పకుండా చూస్తానని అనుపమ పేర్కొంది. ప్రస్తుతం ఈ మలయాళం కుట్టీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాగా అనుపమ నటించిన క్రేజీ కల్యాణం సినిమా విషయానికి వస్తే. . ఇదొక డిఫరెంట్ స్టోరీ అని తెలుస్తోంది. ఈ రోజుల్లో పెళ్లి అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించిట్లు తెలుస్తోంది. బద్రప్ప గాజుల తెరకెక్కించిన ఈ సినిమాలో అనుపమతో పాటు నరేష్‌ వీకే, తరుణ్‌ భాస్కర్, అఖిల్‌ రాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. బూసమ్ జగన్ మోహన్‌రెడ్డి నిర్మించిన సాంగ్స్, గ్లింప్స్, ట్రైలర్ సినీ అభిమానులను బాగానే ఆకట్టుకున్నాయి. క్రేజీ కల్యాణంతో పాటు శర్వానంద్ హీరోగా నటిస్తోన్న ‘భోగి’ సినిమాలో కథానాయికగా చేస్తోంది అనుపమ. సంపత్ నంది తెరకెక్కిస్తోన్న ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటీవల రిలీజైన భోగి గ్లింప్స్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే భోగి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

అనుపమ క్రేజీ కల్యాణం సినిమా ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us