AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ పని చేస్తే సినిమా ఛాన్స్ ఇస్తానన్నారు.. సౌత్ డైరెక్టర్‌పై హీరోయిన్ నీతి టేలర్!

సినిమా ఇండస్ట్రీలో ముఖ్యంగా టాలీవుడ్ లో బెస్ట్ లవ్ స్టోరీ అంటే చెప్పే లిస్ట్ లో ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఉంటుంది. అదే మేం వయసుకు వచ్చాం. ఈ సినిమా ఓ క్లాసిక్ అనే చెప్పాలి యూత్ ను ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది.

ఆ పని చేస్తే సినిమా ఛాన్స్ ఇస్తానన్నారు.. సౌత్ డైరెక్టర్‌పై హీరోయిన్ నీతి టేలర్!
Niti Taylor
Rajeev Rayala
|

Updated on: Oct 13, 2026 | 12:55 PM

Share

సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించే నటీనటులకు ఎదురయ్యే ఇబ్బందుల గురించి అప్పుడప్పుడు పలువురు సెలబ్రిటీలు బహిరంగంగా మాట్లాడుతుంటారు. ముఖ్యంగా కాస్టింగ్ కౌచ్ అంశం సినీ పరిశ్రమలో తరచూ చర్చకు వస్తుంటుంది. తాజాగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి నీతి టేలర్ తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఓ చేదు అనుభవాన్ని పంచుకుంది. మరో సినిమా అవకాశం ఇస్తానంటూ ఓ దర్శకుడు తనను అసభ్యకరమైన కోరిక కోరాడని ఆమె తెలిపింది. దాంతో ఇపుడు ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. నీతి టేలర్ పేరు చెప్పగానే తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చే సినిమా ‘మేం వయసుకు వచ్చాం’. ఈ చిత్రంతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. తర్వాత పలు భాషల్లో నటిగా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది.

నీతి టేలర్ తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణాది చిత్ర పరిశ్రమలో రెండు సినిమాలు చేసిన తర్వాత, తన తొలి చిత్రానికి పనిచేసిన దర్శకుడు మరో ప్రాజెక్ట్ గురించి మాట్లాడేందుకు ఆమెకు ఫోన్ చేశారట. అయితే సినిమా అవకాశం గురించి చెప్పిన ఆ దర్శకుడు, ఆ పాత్రలో నటించాలంటే తనతో కమిట్మెంట్ కు అంగీకరించాలనే అర్థం వచ్చేలా మాట్లాడినట్లు నీతి తెలిపింది. సినిమాలో నటించే అవకాశం కోసం ఇలాంటి షరతు విధించడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆమె తెలిపింది.

ఆ దర్శకుడి మాటలు విన్న వెంటనే ఏం చేయాలో అర్థం కాలేదని నీతి టేలర్ తెలిపింది.  అతను అలా మాట్లాడగానే వెంటనే ఫోన్ కట్ చేసి, ఆ వ్యక్తి నంబర్‌ను బ్లాక్ చేసినట్లు ఆమె తెలిపింది. ఆ తర్వాత కన్నీళ్లతో తన తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పుకున్నట్లు నీతి  వెల్లడించింది. తనకు ఫోన్ చేసిన దర్శకుడు గతంలో ఇతర మహిళలతోనూ అనుచితంగా ప్రవర్తించిన సందర్భాలను ఉన్నప్పటికీ, తన విషయంలోనూ అలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించలేదని నీతి తెలిపింది. ఈ ఘటన తనపై తీవ్ర ప్రభావం చూపిందని, దాని తర్వాత దక్షిణాది సినిమాల కంటే టెలివిజన్ రంగంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us