Threat Calls: రోజులు లెక్కపెట్టుకో.. నిన్ను చంపేస్తాం.. ఉద్యమ నేతకు అగంతకుల వార్నింగ్..!
Rakesh Tikait : దేశంలో రోజురోజుకూ బెదిరింపుల కల్చర్ పెరిగిపోతోంది. ప్రజల పక్షాన పోరాడే నేతలకు చంపేస్తామనే బెదిరింపు కాల్స్ సర్వసాధారణంగా మారాయి.
Rakesh Tikait : దేశంలో రోజురోజుకూ బెదిరింపుల కల్చర్ పెరిగిపోతోంది. ప్రజల పక్షాన పోరాడే నేతలకు చంపేస్తామనే బెదిరింపు కాల్స్ సర్వసాధారణంగా మారాయి. తాజాగా భారతీయ కిసాన్యూనియన్నేత రాకేశ్టికాయిత్కు మరోసారి బెదిరింపు కాల్స్వచ్చాయి. దీనిపై ఘజియాబాద్‌లోని కౌశాంబి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు. ఫోన్కాల్ద్వారా బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు అధికారులు. టికాయిత్ భద్రతలో ఉన్న ఉత్తరప్రదేశ్పోలీసు సిబ్బంది నితిన్‌కు ఈ ఫోన్కాల్వచ్చినట్లు చెబుతున్నారు పోలీసులు. దుండగుడు మొదట అసభ్యంగా మాట్లాడి, ఆపై చంపేస్తానని బెదిరించాడని వివరించారు అధికారులు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీస్‌స్టేషన్ ఇన్‌ఛార్జీ సచిన్మాలిక్ తెలిపారు. ఆడియో క్లిప్‌ను టికాయిత్ ద్వారా అందుకొని, దాని ఆధారంగా తదుపరి విచారణ జరుపుతామని వెల్లడించారు.
కాగా, టికాయిత్‌కు గతంలోనూ పలుమార్లు ఇదే తరహాలో బెదిరింపులు వచ్చాయి. మరో బీకేయూ నేత, టికాయిత్ సన్నిహితుడు జయ మాలిక్హత్య కుట్రను భగ్నం చేశారు పోలీసులు. ఘాజీపుర్ సరిహద్దులో టికాయిత్నిర్వహిస్తున్న ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్నారు మాలిక్.ఆయన్ను హత్య చేసేందుకు ప్రయత్నించిన కిషోర్, సోనూలను అరెస్ట్‌చేశారు పోలీసులు. ఈనెల 3న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వ్చచింది. ఈ ఇష్యూలో మోదీనగర్‌కు చెందిన వీర్‌సేన్, సంజయ్ ప్రధాన్కుట్ర పన్నినట్లు తెలిపారు అధికారులు. రూ. 10 లక్షల సుపారీ ఇచ్చారని వెల్లడించారు పోలీసులు. నిందితులను రెండు రోజుల క్రితం భోజ్‌పుర్‌లో పట్టుకున్నట్టు తెలుసుస్తోంది. అటు టికాయత్ ఇష్యూపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు రైతులు. నిందితులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలు.
Also read:
Omicron Variant-Third Wave: భారత్ లో ఒమిక్రాన్ విలయతాండవం.. అలెర్ట్ ప్రకటించిన ప్రభుత్వం..(వీడియో)