population in India: దేశంలో జనాభా తగ్గుతోంది.. మంచిది కాదంటున్న నిపుణులు.!ప్రజలకి పలు సూచనలు..(వీడియో)

population in India: దేశంలో జనాభా తగ్గుతోంది.. మంచిది కాదంటున్న నిపుణులు.!ప్రజలకి పలు సూచనలు..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Dec 06, 2021 | 9:30 AM

దేశంలో జనాభా తగ్గుతోంది. మునుపటితో పోలిస్తే పుడుతున్న పిల్లల సంఖ్య తగ్గిపోయింది. జనాభా అటు తగ్గకుండా ఇటు పెరగకుండా ఉండే స్థిర స్థాయి కన్నా తక్కువగా సంతాన రేటు నమోదవుతోంది.


2019–21 మధ్య నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే – 5లో ఈ వివరాలు వెల్లడయ్యాయి. రెండు దఫాలుగా ఈ సర్వే చేయగా.. గత ఏడాది డిసెంబర్‌లోనే మొదటి దశ సర్వే ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా రెండో దశ ఫలితాలను వెల్లడించింది. అయితే దేశ జనాభా తగ్గడం మంచిది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇలా సంతాన రేటు తగ్గడం దేశానికి మంచిది కాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.సంతాన రేటు తగ్గడం దేశానికి మంచిది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ.. యువత మీదే ఆధారపడి నడుస్తోందని, 2035 నాటికి యువత తగ్గిపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. అప్పటికి దేశంలో యువతకన్నా పెద్దవారే ఎక్కువగా ఉంటారని అంటున్నారు. వాళ్లలో ఎక్కువ మంది నైపుణ్యం కలిగి ఉండి ఉద్యోగాలు చేసినంత వరకు మంచిదేనని, కానీ, ఆ తర్వాత పనిచేసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోయే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఫలితంగా దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థపైనా పడే అవకాశం ఉందంటున్నారు.ఇక గతంతో పోలిస్తే సంతాన రేటు 2.0కి పడిపోయిందని సర్వే పేర్కొంది. దాని ప్రకారం దేశంలోని ఒక మహిళ సగటున ఇద్దరు పిల్లలకు జన్మనిస్తోందని వెల్లడించింది. 2015–16లో నిర్వహించిన ఎన్హెచ్ఎఫ్ఎస్–4లో అది 2.2గా ఉండేదని, ఇప్పుడు పడిపోయిందని తెలిపింది. సాధారణంగా టీఎఫ్ఆర్ 2.1 ఉంటే దానిని రీప్లేస్ మెంట్ లెవెల్ అంటారని సర్వే వెల్లడించింది. వాస్తవానికి 1998–99లో 3.2గా ఉన్న టీఎఫ్ఆర్.. రెండు దశాబ్దాల్లో భారీగా పడిపోయింది. తాజా సర్వేలో ఐదు రాష్ట్రాలు మినహా 32 రాష్ట్రాల్లో సంతాన రేటు రీప్లేస్ మెంట్ రేటు కన్నా తక్కువ స్థాయిలో నమోదైందని పేర్కొంది. బీహార్, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, మేఘాలయ, మణిపూర్ లోనే జనాభా పెరుగుదల ఉందని తెలిపింది.