Most Expensive Goat: వామ్మో.. ఈ మేకపోతు రేటెంతో తెలిస్తే షాకవుతారు…! రికార్డ్స్ బ్రేక్ చేసిన ఈ మేక.. (వీడియో)
ఇప్పడు మీరు ఒక మేకపోతు గురించి తెలుసుకోబోతున్నారు.. మేకపోతు గురించి మీరేంటి మాకు చెప్పేది అనుకుంటున్నారా... ఇది మీరనుకునే మేకపోతు కాదండోయ్.. ఇది చాలా ప్రత్యేకమైనది. దీని ధర ఎంతో తెలిస్తే మీరు నోరెళ్ల బెడతారు తెలుసా.. సరే.. అసలు విషయానికి వెళ్లిపోదాం...
సాధారణంగా మేకలు, గొర్రెలను మందగా అమ్మితే ఒక రేటు.. విడివిడిగా అమ్మితే ఒకలాంటి రేటు ఉంటుంది. ఎంత ఉత్తమ జాతికి చెందిన మేక అయినా, గొర్రె అయినా మహా అయితే లక్ష రూపాయలు ఖరీదు చేస్తుందేమో. కానీ ఇప్పుడు మీరు చూడబోయే మేకపోతు చాలా ప్రత్యేకమైనది. అందుకే అది ఏకంగా 21 వేల డాలర్లు అంటే 15,64,983 రూపాయల ధర పలికింది. ఆస్ట్రేలియాకు చెందిన మర్రకేశ్ అనే పేరు కలిగిన ఈ మేకపోతు ప్రపంచలోనే అత్యంత ఖరీదైనదిగా నిలిచింది. పశ్చిమ న్యూ సౌత్ వేల్స్ పట్టణంలోని కోబార్‌లో నవంబరు 25న ఈ మేక పోతు అమ్మకానికి వచ్చింది. ఈ మేకపోతును ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ మోస్లీ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. ‘‘ఈ మేక పోతు చాలా అందంగా,దృఢంగా ఉంది. మరీ పెద్దగా కాకుండా.. మరీ చిన్నదిగా కాకుండా.. మధ్యస్థంగా ఉండే ఈ మేక పోతు చాలా త్వరగా పెరుగుతుంది. అంతే త్వరగా మందతో కలిసిపోతుంది’’అని తెలిపాడు మోస్లీ. గతంలో ఆస్ట్రేలియాలో ఓ మేక 12 వేల డాలర్లు పలకగా.. తాజాగా మర్రకేస్ ఆ రికార్డును బ్రేక్ చేసింది.
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

